MK Stalin Nitin Gadkari : రోడ్లు అధ్వాన్నం కేంద్రం కారణం
నిధులు మంజూరు చేయాలని లేఖ
MK Stalin Nitin Gadkari : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వేగం పెంచారు. నిన్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందారంటూ ఆరోపించారు. తాజాగా కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా సంస్థ మంత్రి నితిన్ గడ్కరీకి సీరియస్ గా లేఖ రాశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు.
గతంలో పలుమార్లు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినా పట్టించు కోలేదని ఆరోపించారు. తాను ఢిల్లీలో పర్యటించిన సమయంలో కూడా రోడ్ల దుస్థితి గురించి తెలియ చేసినా ఈరోజు వరకు స్పందించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఇటీవల తాను రైలులో ప్రయాణం చేశానని, ఆ క్రమంలో కొన్ని జిల్లాల్లో కూడా పర్యటించానని తెలిపారు.
వాహనాలు వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయిందని పేర్కొన్నారు సీఎం ఎంకే స్టాలిన్. చెన్నై నుంచి రాణిపేట జాతీయ రహదారికి మధ్య రోడ్డు కనెక్షన్ అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం(MK Stalin Nitin Gadkari) . కాంచీపురం, వెల్లూరు, రాణిపేట్ , హోసూర్ , కృష్ణ గిరిలోని పారిశ్రామిక సమూహాలకు చెన్నై , దాని పోర్టుల నుండి రోడ్డు సెగ్మెంట్ ప్రాముఖ్యమైన కనెక్టివిటీని అందిస్తుందని పేర్కొన్నారు ఎంకే స్టాలిన్.
ఇదిలా ఉండగా డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సైతం పార్లమెంట్ లో ప్రత్యేకంగా రోడ్ల దుస్థితి గురించి ప్రస్తావించారని, అయినా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా సీఎం రాసిన లేఖ కలకలం రేపుతోంది.
Also Read : హామీల వర్షం ఆచరణ శూన్యం – సీఎం