Congress Slams : కామెంట్స్ తొలగింపుపై కాంగ్రెస్ కన్నెర్ర
కావాలని కేంద్రం ఆడుతున్న నాటకం
Congress Slams : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పు పట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ , అరిందమ్ చౌదరి, తదితరులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని , బీజేపీ సంకీర్ణ సర్కార్ పై నిప్పులు చెరిగారు. అంతే కాకుండా అదానీ కంపెనీకి లబ్ది చేకూర్చేలా మోదీ వ్యవహరించారంటూ సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ.
ఇదే సమయంలో ఏఐసీసీ చీఫ్ మోదీని ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ , ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది కాంగ్రెస్. కంట్రోల్ ఫ్రీక్ సర్కార్ అంటూ సీరియస్ కామెంట్స్ చేసింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలలో తొలగింపు అర్హత ఏమీ లేదని పేర్కొంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి(Congress Slams) తెచ్చింది. ఏకాభిప్రాయం, సహకారం , సామరస్యం ద్వారా పార్లమెంట్ ను నడపాలని బీజేపీ కోరుకోవడం లేదని ఆరోపించింది.
అందుకే తమ పార్టీకి చెందిన వారి కామెంట్స్ ను పరిగణలోకి తీసుకోలేదని మండిపడింది. ఈ మొత్తం వ్యవహారంపై జవాబుదారీతనం లేక పోవడం వల్లే ఇలా జరిగిందని పేర్కొంది.
పరువు నష్టం కలిగించేది లేదా అసభ్యకరమైనది ఏదీ లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వి ఆరోపించారు.
Also Read : పవర్ లోకి వస్తే ప్రజా పాలన – ఖర్గే