Elizabeth Jones : భారత్ తో యుఎస్ బంధం ముఖ్యం – జోన్స్
అమెరికా దౌత్యవేత్త ఎలిజబెత్ కామెంట్స్
Elizabeth Jones : భారత్ తో అమెరికా సంబంధం కలిగి ఉండడం అనేది అత్యంత ముఖ్యమైన విషయమని స్పష్టం చేశారు అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్. బెంగళూరులో నిర్వహిస్తున్న ప్రీమియర్ ఏవియేషన్ చరిత్రలో మరో మైలురాయిగా అభివర్ణించారు.
ఆమె ఆదివారం బెంగళూరులో మాట్లాడారు. భారత్ , అమెరికా అనేక విధాలుగా కీలక భాగస్వాములని స్పష్టం చేశారు. భారత్ లోని యుఎస్ ఛార్జ్ డి ఎఫైర్స్ అంబాసిడర్ ఎలిజబెత్ జోన్స్ పర్యటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన ఎగ్జిబిషన్ లో పాల్గొనేందుకు వచ్చారు.
వాతావరణ మార్పు, ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగు పర్చడం , సైబర్ సవాళ్లను ఎదుర్కోవడం , స్థిరమైన సరఫరాను నిర్ధారించడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు అమెరికాకు భారతదేశం ఎంపిక భాగస్వామి అని పేర్కొన్నారు ఎలిజబెత్ జోన్స్(Elizabeth Jones) .
ఇదిలా ఉండగా రెండు వారాల కిందట ఇండియా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై యుఎస్ ఇండియా చొరవను ప్రారంభించేందుకు వైట్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహించారని తెలిపారు.
ద్వైపాక్షిక రక్షణ ద్వారా ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తిని వేగవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పారిశ్రామిక రంగంలో కూడా సహకారం అందించు కోవడం అత్యంత ముఖ్యమన్నారు. ఏరో ఇండియా 2023 కోసం ఇవాళ మీతో కలిసి రావడం గర్వ కారణంగా ఉందన్నారు ఎలిజబెత్ జోన్స్ . ఇదిలా ఉండగా ఫిబ్రవరి 13న ఏరో ఇండియా -2023లో యుఎస్ఏ భాగస్వామ్య పెవిలియన్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
బైడన్ ప్రభుత్వం భారత్ తో అత్యంత గట్టి బంధాన్ని కోరుకుంటోందని అన్నారు యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ జెడిడియా పి. రాయల్.
Also Read : రోడ్లు జాతి నిర్మాణానికి పునాదులు – మోదీ