Bhim Army Chief : పవర్ లోకి వస్తే గిరిజనుడే సీఎం – ఆజాద్
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్
Bhim Army Chief : తాము అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి గిరిజనుడే ముఖ్యమంత్రి అవుతాడని సంచలన ప్రకటన చేశారు భీమ్ ఆర్మీ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్. ప్రజల మద్దతును కూడగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ యాత్రలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఈ ఏడాది చివరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భోపాల్ లో దళిత, గిరిజన , ఓబీసీ సంఘాల మెగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్(Bhim Army Chief) ప్రసంగించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా దళిత, గిరిజన, ఓబీసీ, మైనార్టీల సంఘాల సమిష్టి బ్యానర్ కింద అభ్యర్థులను బరిలోకి దించుతామని ప్రకటించారు. మన కోటా మన వాటా కింద మనం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంత కాలం అందరినీ నమ్ముకుంటూ వచ్చాం. కానీ ఏ ఒక్క పార్టీ బహుజనులు, మైనార్టీలను ఆదుకున్న పాపాన పోలేదన్నారు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్. ఇక నుంచి మనందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
మనం వేర్వేరుగా ఉండడం వల్లనే మనం ఇంకా వెనుకబడి ఉన్నామని, అందుకే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఓటు ఆయుధం అన్నది ప్రతి ఒక్కరు తెలుసు కోవాలని హెచ్చరించారు. మనల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నంత కాలం మనం ఇంకా ఇంకా వెనుకబాటు తనానికి గురవుతామని స్పష్టం చేశారు భీమ్ ఆర్మీ పార్టీ చీఫ్(Bhim Army Chief).
Also Read : రోడ్లు జాతి నిర్మాణానికి పునాదులు – మోదీ