John Barla : క్రిష్టియ‌న్లు కీల‌కం గుర్తింపు శూన్యం

కేంద్ర మంత్రి జాన్ బార్లా కామెంట్స్

John Barla : కేంద్ర మంత్రి జాన్ బార్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశ నిర్మాణంలో క్రిష్టియ‌న్లు పెద్ద‌పీట వేశార‌ని కానీ వారికి స‌రైన గుర్తింపు రాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశ మంత‌టా ఉన్న క్రైస్త‌వులు క‌లిసి ఉండాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని స్ప‌ష్టం చేశారు జాన్ బార్లా(John Barla). దేశానికి వారు చేసిన సేవ‌ల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. క్రైస్త‌వులు దేశానికి ప్ర‌మాద‌క‌రం కాద‌ని , దేశ నిర్మాణంలో ముందంజ‌లో ఉన్నార‌ని ప్ర‌శంసించారు కేంద్ర మంత్రి.

ఇదిలా ఉండ‌గా దేశంలోని క్రైస్త‌వ స‌మాజం దేశ నిర్మాణానికి ఎన్నో సేవ‌లు అందించింద‌ని , అయితే రావాల్సిన గుర్తింపు రాలేద‌న్నారు జాన్ బార్లా. నాగాలాండ్ లోని దిమాపూర్ లో నేష‌న‌ల్ క్రిస్టియ‌న్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి ప్ర‌సంగించారు. స్వాతంత్రానికి ముందు , ఆ త‌ర్వాత తాము చేసిన కృషిని దేశానికి తెలియ చేసేందుకు స‌మాజంలోని ప్ర‌జ‌లంతా ఏకం కావాల‌ని పిలుపునిచ్చారు.

క్రైస్తవులు నిర్మించిన విద్యా సంస్థ‌ల్లో చ‌దివిన వారు ఐఏఎస్ లు గా , డాక్ట‌ర్లుగా , ఇంజ‌నీర్లుగా , రాజ‌కీయ నాయ‌కులుగా ఎదిగార‌ని అన్నారు. స‌మాజ నిర్మాణంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న క్రైస్త‌వులు ఏం చేశామో దేశానికి ఏం ఇచ్చామో ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు జాన్ బార్లా.

అందుకే త‌మ‌కు గౌర‌వం ల‌భించ‌డం లేద‌ని మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌న బాకా ఊద‌డం లేద‌ని, అందుకే మ‌న‌కు గుర్తింపు ల‌భించ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి.

Also Read : అధికారం శాశ్వ‌తం కాదు – అజిత్ ప‌వార్

Leave A Reply

Your Email Id will not be published!