Nishikant Dubey Rahul Gandhi : రాహుల్ సారీ చెప్పాల్సిందే
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్
Nishikant Dubey Rahul Gandhi : రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగింది భారతీయ జనతా పార్టీ. పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, బీజేపీ సర్కార్ పై. మోదీ లోపాయికారి సహకారం వల్లనే అదానీ గ్రూప్ అంతలా ఎదిగిందని మండిపడ్డారు.
2014కు ముందు అదానీ ర్యాంక్ 614 అని కానీ మోదీ ప్రధానిగా కొలువు తీరాక ఆ ర్యాంకు కాస్తా 3వ స్థానానికి ఎలా చేరుకుందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. దీని వెనుక ఉన్న అసలు మతలబు ఏమిటో చెప్పాలని నిలదీశారు. ఇదే సమయంలో పార్లమెంట్ భాషకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు రాహుల్ గాంధీపై.
రాహుల్ గాందీ తాను డాక్యుమెంటరీ సాక్ష్యాలను అందజేస్తానని సభలో ప్రకటన చేశారని కానీ తాను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు తగిన పత్రాలను ఇప్పటి వరకు పార్లమెంట్ లో సమర్పించ లేదని ఆరోపించారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే(Nishikant Dubey).
దీంతో ఆయన సమర్పించక పోతే తన లోక్ సభ ఎంపీ స్థానాన్ని కోల్పోకోక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్బంగా వెంటనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా రాహుల్ వ్యాఖ్యానించారని ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్దమని మండిపడ్డారు నిషికాంత్ దూబే.
ఇదిలా ఉండగా ప్రధానిమోదీపై చేసిన కామెంట్స్ కు సంబంధించి ఇద్దరు బీజేపీ సభ్యులు నిషికాంత్ దూబే ,ప్రహ్లాద్ జోషి నోటీసులు దాఖలు చేశారు. దీంతో రాహుల్ గాంధీని సమాధానం చెప్పాల్సిందిగా కోరింది.
Also Read : గిరిజన కుటుంబానికి రాహుల్ భరోసా