CM Ashok Gehlot Modi : పోటీ అబద్దం మోదీతో యుద్ధం – సీఎం
గెహ్లాట్ షాకింగ్ కామెంట్స్
CM Ashok Gehlot Modi : రాజస్థాన్ లో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. మరో వైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పవర్ లోకి రావాలని చూస్తోంది.
అపారమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా పేరొందారు ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్(CM Ashok Gehlot). ఆయనకు పార్టీలోని సచిన్ పైలట్ నుంచే ఎక్కువగా తలనొప్పి ఎదురవుతోంది. అయినా మ్యానేజ్ చేస్తూ వస్తున్నారు సీఎం. ఈ తరుణంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సీఎం సంచలన కామెంట్స్ చేశారు. అదేమిటంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరితోనూ తనకు పోటీ లేదని స్పష్టం చేశారు.
ఇక రాబోయే ఎన్నికల్లో ఎవరితోనైనా తాను ఢీకొనేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. సోమవారం ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అదేమిటంటే రాజస్థాన్ లో ఎన్నికలలో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు అశోక్ గెహ్లాట్ . ఇదే సమయంలో ట్రబుల్ షూటర్ అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తో కూడిన టీంను ఎదుర్కొనే దమ్ము , సత్తా తనకు ఉందని కుండ బద్దలు కొట్టారు రాజస్థాన్ సీఎం.
ఇదిలా ఉండగా తన బడ్జెట్ ప్రసంగంలో దొర్లిన తప్పిదంపై ప్రధాని చేసిన విమర్శలపై ఆయన సీరియస్ గా స్పందించారు. నేను పాత బడ్జెట్ ను కేవలం 34 సెకన్లు మాత్రమే చదివాను. గత ఏడాది బడ్జెట్ ను తాను చదివినట్లుగా బీజేపీ ప్రచారం చేసింది.
ఎందుకంటే అది వాట్సాప్ యూనివర్శిటీ కదా అని ఎద్దేవా చేశారు. మా బడ్జెట్ అద్బుతంగా ఉందని వాళ్లకు తెలుసు. ఎందుకంటే వాళ్లకు ఇప్పుడే భయం మొదలైందని అన్నారు అశోక్ గెహ్లాట్.
Also Read : వైద్యుల రక్షణకు సమగ్ర చట్టం అవసరం