AP CM Jagan Inaugurates : ఏపీలో టూరిస్ట్ పోలీస్ స్టేష‌న్లు

ఏపీ సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

AP CM Jagan Inaugurates : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు రాష్ట్రంలోని ప‌ర్యాట‌క ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు(AP CM Jagan Inaugurates) ప్ర‌క‌టించారు. 20 టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయ‌ని చెప్పారు. వీటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విదేశాలు లేదా దేశంలోని ఇత‌ర ప్రాంతాల నుంచి ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు వ‌చ్చే సంద‌ర్శ‌కులు, పర్యాట‌కుల‌కు అనుగుణంగా ఉండేందుకు గాను వీటిని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ప‌ర్యాట‌కుల‌కు, ప్ర‌కృతి ప్రేమికుల‌కు సౌక‌ర్యంగా ఉండేందుకు, ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌డం, అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని ఇవ్వ‌డం, అంతే కాకుండా ఆయా ప్రాంతాల‌లోని ప‌ర్యాట‌క స్థ‌లాల‌కు సంబంధించిన చ‌రిత్ర‌, విశిష్ట‌త‌ను తెలియ చేసేలా చేయ‌డం వీటి ముఖ్య ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ప‌ర్యాట‌క ప్రాంతాలే కాకుండా ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రాలు సైతం పెద్ద ఎత్తున ఏపీలో కొలువు తీరి ఉన్నాయి. ప్ర‌ధానంగా తిరుమ‌ల అత్య‌ధిక ఆదాయ వ‌న‌రుగా ఉంది రాష్ట్రానికి. ఇవాళ తాడేప‌ల్లి గూడెం సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి పోలీస్ స్టేష‌న్ల‌ను వ‌ర్చువ‌ల్ గా సీఎం జ‌గ‌న్ రెడ్డి ప్రారంభించారు.

ఇదే స‌మ‌యంలో దిశ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఏపీ సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 20 ల‌క్ష‌ల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నార‌ని చెప్పారు. యాప్ లో ఫిర్యాదు చేస్తే కేవ‌లం 5 నిమిషాల్లోనే స‌మాధానం ఇస్తున్నార‌ని తెలిపారు. జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని అమ‌లులోకి తీసుకు వ‌చ్చామ‌న్నారు. ప‌ర్యాట‌క‌, పుణ్య క్షేత్రాల‌లో భ‌ద్ర‌త‌కు ప్ర‌యారిటీ ఇవ్వాల‌న్నారు జ‌గ‌న్ రెడ్డి(AP CM YS Jagan).

Also Read : ఏ పార్టీకి 60 సీట్లు మించి రావు

Leave A Reply

Your Email Id will not be published!