KTR IT Raids BBC : బీబీసీ స‌రే హిండెన్ బ‌ర్గ్ పై దాడి చేస్తారా

కేంద్ర స‌ర్కార్ తీరుపై మంత్రి కేటీఆర్ ఫైర్

KTR IT Raids BBC : రాష్ట్ర ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR IT Raids BBC) నిప్పులు చెరిగారు. మోదీ ది క్వ‌శ్చ‌న్ పేరుతో అంత‌ర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ డాక్యుమెంట‌రీ ప్ర‌సారం చేసింది. దీనిపై కేంద్రం క‌న్నెర్ర చేసింది. ఆపై దాని లింకులు ఎక్క‌డా ఉండ కూడ‌దంటూ సోష‌ల్ మీడియాను ఆదేశించింది.

దీనిని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన కేసుపై సుప్రీంకోర్టు త‌ప్పు ప‌ట్టింది. బీబీసీపై నియంత్ర‌ణ ఉండ‌ద‌ని, అది పూర్తిగా భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను హ‌రించిన‌ట్ల‌వుతుంద‌ని పేర్కొంది. ఇందుకు సంబంధించి పూర్తి డాక్యుమెంట్ల‌ను, రికార్డుల‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. నిషేధం కుద‌ర‌ని తేల్చి చెపింది. ఈ త‌రుణంలో మంగ‌ళ‌వారం అక‌స్మాత్తుగా కేంద్ర ఆదాయా ప‌న్ను శాఖ (ఐటీ) ఏక‌కాలంలో ఢిల్లీ, ముంబై లోని బీబీసీ ఆఫీసుల‌పై దాడులు చేసింది. 

సిబ్బందికి చెందిన సెల్ ఫోన్ల‌ను , ల్యాప్ టాప్ ల‌ను, డెస్క్ టాప్ ల‌ను స్వాధీనం చేసుకుంది. ఆదాయ ప‌న్ను ఎగ‌వేత‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని అందుకే సోదాలు చేప‌ట్టిన‌ట్లు తెలిపింది ఐటీ శాఖ‌.

ఇదిలా ఉండ‌గా ఇది పూర్తిగా భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్చ‌పై దాడిగా పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జైరాం ర‌మేష్ , ఎంపీ మ‌హూవా మోయిత్రా. తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌స్తుతానికి బీబీసీపై ఐటీ దాడులు చేశార‌ని(KTR IT Raids BBC) , మ‌రి మోదీ మిత్రుడిగా పేరు పొందిన గౌత‌మ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించిన హిండెన్ బ‌ర్గ్ సంస్థ‌పై కూడా ఐటీ దాడులు చేస్తుందా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

Also Read : మ‌హాశివ‌రాత్రికి దండిగా బ‌స్సులు

Leave A Reply

Your Email Id will not be published!