UK PM Rishi Sunak Promises : భద్రత ముఖ్యం కూల్చడం ఖాయం
యూకే పీఎం రిషి సునక్ స్ట్రాంగ్ వార్నింగ్
UK PM Rishi Sunak Promises : అన్నింటి కంటే తమ దేశ భద్రత అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు యూకే పీఎం రిషి సునక్. ఎలాంటి అనుమానాస్పద వస్తువులనైనా తాము కూల్చి వేయడమో లేదా ధ్వంసం చేయడమో చేస్తామన్నారు. ఇటీవల పలు దేశాలపై చైనా రహస్యంగా బెలూన్ల ద్వారా నిఘా ఉంచుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు పీఎం. ఓ వైపు ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్నారు. మరో వైపు చైనాతో ఢీకొట్టేందుకు సిద్దంగా ఉన్నామని వార్నింగ్ ఇచ్చారు.
దేశాల మధ్య స్నేహం ఉండాలి కానీ శత్రుత్వం ఉండకూడదన్నారు రిషి సునక్. అయితే చైనా నిఘా బెలూన్లతో భారత్ , బ్రిటన్ , కెనడా, అమెరికాతో పాటు పలు దేశాలలో నిఘా ఉంచుతోందని ఆరోపణలు ఉన్నాయి.
ఎలాంటి చర్యలకైనా వెనుకాడే ప్రసక్తి లేదన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల అమెరికా గగన తలంపై ఓ బెలూన్ అనుమానాస్పదంగా కనిపించింది. దీనిని గుర్తించిన ఆ దేశ చీఫ్ బైడెన్ వెంటనే కూల్చి వేయాలంటూ ఆదేశించారు.
యుద్ద విమానం కూల్చి వేసింది. ఇదే సమయంలో మరో మూడు అనుమానస్పద వస్తువులు రావడం వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్(UK PM Rishi Sunak Promises) సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఒక దేశంపై మరో దేశం దాడి చేయాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు. సరైన రీతిలో సరైన సమయంలో సమాధానం చెప్పడం ఖాయమన్నారు .
తమ దేశ గగనతలాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు సంసిద్దమై ఉన్నామని స్పష్టం చేశారు. దాడి చేయాలని అనుకుంటే చైనాతో యుద్దం చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
Also Read : మిచిగాన్ క్యాంపస్ లో కాల్పులు