TS BJP Chief Bandi Sanjay : రాబోయే కాలం మాదే అధికారం – బండి
బీజేపీ స్టేట్ చీఫ్ షాకింగ్ కామెంట్స్
TS BJP Chief Bandi Sanjay : తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. ఎవరికి వారే తామే పవర్ లోకి వస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను గ్రెనేడ్లతో కూల్చి వేస్తానని హెచ్చరిస్తే..తాజ్ మహల్ ను పోలి ఉందని , కేవలం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే సచివాలయాన్ని సీఎం నిర్మించారంటూ మండిపడ్డారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్.
ఆపై తాము పవర్ లోకి వచ్చిన వెంటనే కూల్చి వేస్తామని హెచ్చరించారు. విచిత్రం ఏమిటంటే రూ. 12,000 కోట్లతో ప్రగతి భవన్ నిర్మిస్తే దాదాపు రూ. 600 కోట్లకు పైగా సచివాలయాన్ని నిర్మించారు. ఈ డబ్బంతా ప్రజలదేనన్న విషయం పాలకులకు తెలియకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
తాజాగా బండి సంజయ్(TS BJP Chief Bandi Sanjay) కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకు పడ్డారు. వాళ్లకు అంత సీన్ లేదని రాబోయే కాలం తమదేనని, తాము అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఐసీయులో ఉందని, బీఆర్ఎస్ కు దిక్కు లేదని ఎద్దేవా చేశారు. వాళ్లదంతా దండుపాళెం బ్యాచ్ అంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపాయి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అంతకంతకూ బలపడుతోందన్నారు. దానిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ , బీఆర్ఎస్ , ఎంఐఎం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కు చెందిన అద్దంకి దయాకర్ కోమటిరెడ్డిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : బీబీసీ సరే హిండెన్ బర్గ్ పై దాడి చేస్తారా