YS Sharmila TS Govt : దొర పాలనలో కబ్జాల పర్వం – షర్మిల
కేసీఆర్ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్
YS Sharmila TS Govt : వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దొర పాలనలో కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అందినంత మేర దోచుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ఓట్లు వేసిన పాపానికి కల్వకుంట్ల కుటుంబం లాభ పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. రాష్ట్రంలో బాధ్యత కలిగిన మంత్రులు మతి తప్పి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల(YS Sharmila TS Govt).
విచిత్రం ఏమిటంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు డబ్బులు ఏవని సర్పంచులు అడిగితే బీరు సీసాలు అమ్ముకొని ఆదాయం తెచ్చుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి అవగాహన లేని వాళ్లను కేబినెట్ లో కొనసాగిస్తున్నందుకు సిగ్గు పడాలన్నారు షర్మిల.
వీళ్లు ప్రజలకు ఏం సేవలు చేస్తారని ప్రశ్నించారు. మంత్రి తన నియోజకవర్గంలో కొండల్ని, గుట్టల్ని దేనినీ వదిలి పెట్టడం లేదని ఆరోపించారు. దివ్యాంగులకు సైతం పెన్షన్లు రావడం లేదని ఆవేదన చెందారు వైఎస్ షర్మిల(YS Sharmila TS Govt).
తాము పవర్ లోకి వచ్చిన వెంటనే ఉచితంగా పక్కా ఇండ్లు ఇస్తామన్నారు. అంతకు ముందు జనగామ శివారు నెల్లుట్ల గ్ఆరమంలో ఇళ్లు లేక అరిగోస పడుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. భరోసా కల్పించారు. స్టేషన్ ఘన్ పూర్ లోని ఈ ఒక్క ఊరులోనే 802 మంది గుడిసెలు వేసుకుని ఉన్నారని వాపోయారు.
Also Read : రాబోయే కాలం మాదే అధికారం – బండి