RS Praveen Kumar CM KCR : ప్రకటించిన రూ. 100 కోట్లు ఎక్కడ
సీఎం కేసీఆర్ ను నిలదీసిన ఆర్ఎస్పీ
RS Praveen Kumar CM KCR : భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టును దర్శించుకున్నారు. ఆంజనేయుడికి పూజలు చేశారు. అనంతరం రెండు గంటల పాటు సమీక్ష జరిపారు. ఏకంగా ఆలయ అభివృద్ది కోసం రూ. 500 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించారు బహుజన సమాజ్ వాది పార్టీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ . బుధవారం ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
గతంలో కొండగట్టు ఆలయానికి రూ. 100 కోట్లు కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా విదిల్చిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఉన్న వాటికే దిక్కు లేదు.. మరోసారి ఆలయాన్ని, దేవుడిని, ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar CM KCR).
సీఎం కేసీఆర్ పై సెటైర్ వేశారు బీఎస్పీ చీఫ్. గతంలో కొండ గట్టు వద్ద బస్సు ప్రమాదం జరిగిందని , కానీ ఘటన స్థలంపై దేశ వ్యాప్తంగా ఆవేదన వ్యక్తమైందని కానీ సీఎంగా ఉండి కూడా సందర్శించ లేదని ఇది ఏ రకమైన పాలననో తెలుసు కోవాలని హెచ్చరించారు.
కేవలం మాయ మాటలతో ప్రజల చెవుల్లో పూలు పెట్టడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సీఎం కేసీఆర్ పదే పదే ప్రకటించే హామీలు, గుప్పించే ఆచరణకు నోచుకోని ప్రకటనలతో ఏకంగా హాలీవుడ్ సినిమా తీయొచ్చని ఎద్దేవా చేశారు. ముందుగా ప్రకటించిన రూ. 100 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : ఆ రెండు పార్టీలు ఒక్కటే – బండి