S Jai Shankar India TOP : నగదు రహిత లావాదేవీలలో భారత్ టాప్
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్
S Jai Shankar India TOP : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యధిక నగదు రహిత లావాదేవీలను నమోదు చేసిన దేశాలలో భారత్ నెంబర్ వన్ గా నిలిచిందని చెప్పారు. భారతీయ ప్రజలు ఇప్పుడు సాంకేతికతను ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు జై శంకర్. శనివారం ఆస్ట్రేలియా లోని సిడ్నీలో జరిగిన బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ లో ఆయన మాట్లాడారు.
యావత్ ప్రపంచం విస్తు పోయేలా భారత్ అన్ని రంగాలలో ముందుకు దూసుకు పోతోంది. అంతే కాదు జి20 గ్రూప్ కు భారత దేశం నాయకత్వం వహిస్తోంది. ఇదే సమయంలో కీలకమైన అంశాలపై ఫోకస్ పెట్టింది. మేం ముందు నుంచి ఉగ్రవాదాన్ని నిరసిస్తూ వస్తున్నాం. ఇదే సమయంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్న టెక్నాలజీని అందుకోవాలని కోరుతున్నాం. ఇందులో భారత దేశానికి చెందిన టెక్నాలజీ నిపుణులు యావత్ ప్రపంచ రంగాన్ని శాసిస్తున్నారని అన్నారు సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar India TOP).
ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్ స్టిట్యూట్ , ఇండియన్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిజిటల్ డెలివరీ లావాదేవీల సమగ్రతను నిర్ధారిస్తుంది.
ఇది ఆర్థిక పరంగా సమానంగా సాధ్యం కాదు. ఖాతాలు తెరవాలని కోరామని తెలిపారు. ఇదే సమయంలో 4,15,000,000 మంది ఖాతాల్లోకి నేరుగా తమ ప్రభుత్వం డబ్బులు జమ చేసిందని ఇది ఓ రికార్డ్ అని చెప్పారు సుబ్రమణ్యం జైశంకర్.
Also Read : జార్జ్ సోరోస్ పై జై శంకర్ కామెంట్స్