Nitish Kumar Strategy : కలిసి నడుద్దాం బీజేపీని ఓడిద్దాం – నితీశ్
ప్రతిపక్షాలకు పిలుపునిచ్చిన బీహార్ సీఎం
Nitish Kumar Strategy : బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానంగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. ప్రతిపక్షాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. మనందరం కలిస్తే బీజేపీని కేవలం 100 సీట్లకు పరిమితం చేయవచ్చని జోష్యం చెప్పారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు నితీశ్ కుమార్(Nitish Kumar Strategy). ఇదిలా ఉండగా 17 ఏళ్లపాటు బీజేపీతో అనుబంధం కలిగిన ఆయన ఉన్నట్టుండి కాంగ్రెస్ , ఆర్జేడీతో కలిసి మహా ఘట్ బంధన్ సర్కార్ ను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ప్రజల వద్దకు పరివర్తన్ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతా ఏకమైతే బీజేపీని నామ రూపాలు లేకుండా చేయొచ్చన్నారు నితీశ్ కుమార్. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీని ఓడించాలంటే మనందరం కలవాలని కోరారు సీఎం. 71 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా పేరు పొందారు నితీశ్ కుమార్. దేశ రాజకీయాలలో మోస్ట్ పాపులర్ లీడర్ గా గుర్తింపు పొందారు.
ఆయన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. వారు నా సూచనను స్వీకరించి పోరాడితే మంచి ఫలితం ఉంటుందన్నారు. శనివారం పాట్నాలో జరిగిన సీపీఎం 11వ మహాసభలో నితీశ్ కుమార్ మాట్లాడారు. తనకు ప్రధానమంత్రి కావాలనే ఆశ లేదన్నారు. తాను ఎప్పుడు పోటీదారుగా ఊహించ లేదన్నారు సీఎం(Nitish Kumar Strategy). దేశాన్ని ఏకం చేయడం, విద్వేషాలను వ్యాప్తి చేసే వ్యక్తుల నుండి దేశాన్ని విముక్తం చేయడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని ప్రకటించారు నితీశ్ కుమార్.
Also Read : ఎన్నికల సంఘం మోదీకి దాసోహం