Samajwadi Party Seeks : ముందు సీటు కోసం ఎస్పీ విన్న‌పం

శివ‌పాల్ యాద‌వ్ కు కేటాయింపు పై

Samajwadi Party Seeks : యూపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు ఒక్కోసారి చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆ రాష్ట్రంలో ములాయం సింగ్ యాద‌వ్ ది ఒక చరిత్ర‌. ఆ త‌ర్వాత కాన్షీరాం చేసిన ప్ర‌యోగం యూపీలో బీఎస్పీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చేలా చేసింది. ఈ త‌రుణంలో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎస్పీ ప‌వ‌ర్ లోకి రావాల‌ని శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ రెండోసారి సీఎం యోగి ఆదిత్యానాథ్ తిరిగి అధికారంలోకి రాగ‌లిగారు. ఒక ర‌కంగా నేర‌స్థులు, అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు.

ఇదే స‌మ‌యంలో సీఎం పై ఆశ‌లు పెట్టుకున్న అఖిలేష్ యాద‌వ్ చివ‌ర‌కు అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా అవ‌తారం ఎత్తారు. ఇదిలా ఉండ‌గా ములాయం మ‌ర‌ణించ‌డం, ఆయ‌న స్థానంలో త‌న భార్య డింపుల్ యాద‌వ్ ను నిల‌బెట్ట‌డం తో సీన్ మారింది. శివ‌పాల్ యాద‌వ్ ఇంటికి స్వ‌యంగా వెళ్లారు భార్య‌, భ‌ర్త‌లు అఖిల్ , డింపుల్ . చివ‌ర‌కు మ‌న‌సు మార్చుకున్న శివ‌పాల్ అఖిలేష్ యాదవ్ తో క‌లిసి పోయారు.

తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 20 నుంచి యూపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా శివ పాల్ యాద‌వ్ కు ముందు వ‌రుస‌లో ఉన్న సీటును కేటాయించాల‌ని ఎస్పీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ కోరారు(Samajwadi Party Seeks). ఈ మేర‌కు సీఎంకు విన్న‌వించారు కూడా. స‌భా రూల్స్ కు సంబంధించి ఆయా పార్టీల‌కు సంబంధించి అధినేత‌లు, ఆయా పార్టీలు ఎన్నిక‌ల్లో సాధించిన సీట్ల మేర‌కు సీట్ల‌ను కేటాయిస్తూ వ‌స్తారు. మ‌రి స‌ర్కార్ ఓకే చెబుతుందా లేదా అన్న‌ది తేలాల్సి ఉంది.

Also Read : ఎన్నిక‌ల సంఘం మోదీకి దాసోహం

Leave A Reply

Your Email Id will not be published!