Sanjay Raut Election Commission : ఎన్నికల సంఘం పక్షపాతం – రౌత్
శివసేన ఎంపీ షాకింగ్ కామెంట్స్
Sanjay Raut Election Commission : శివసేన పార్టీ ఎన్నికల గుర్తుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. విల్లు, బాణం గుర్తును శివసేన తిరుగుబాటు చేసిన మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే శివసేనకు చెందుతుందని ప్రకటించింది. దీనిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు ఆపార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే. ఇదే సమయంలో ఈసీ తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఏకపక్షమని కొట్టి పారేశారు ఎంపీ సంజయ్ రౌత్.
ఇది పూర్తిగా కక్ష సాధింపుతో తీసుకున్న నిర్ణయంగా ఆయన ఆరోపించారు(Sanjay Raut Election Commission). ఒక రకంగా రాజకీయంగా ఎదగకుండా చేయాలనే కుట్రతో చేసిన ప్రయత్నంగా అభివర్ణించారు. శనివారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల సంఘం పూర్తిగా పక్షపాత ధోరణితో ముందు నుంచీ వ్యవహరిస్తోంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయింది. రోజు రోజుకు ప్రశ్నించడం , నిలదీయడం నేరంగా మారింది. ప్రధానంగా మోదీ, అమిత్ షా కనుసన్నలలో ప్రస్తుతం అన్ని వ్యవస్థలు పని చేస్తున్నాయని ఆరోపించారు సంజయ్ రౌత్. ఇది నిజమైన డెమోక్రసీ కానే కాదన్నారు.
ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు ప్రజల్లో మరింత ఆందోళనలు రేకెత్తిస్తాయని గమనించాలని హెచ్చరించారు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి మోదీకి దాసోహమై పోయిందన్నారు. ఇప్పటికే సర్వోన్నత న్యాయ స్థానం సీరియస్ గా కామెంట్స్ చేసింది.
ఎన్నికల కమిషన్ లేదా ఎన్నికల కమిషనర్ అయ్యా అనేటట్లుగా ఉండ కూడదని పేరొన్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీకి సంబంధించి గుర్తు లేకుండా చేసినా ప్రజల్లో బాలా సాహెబ్ ఠాక్రే ఎల్లప్పటికీ నిలిచే ఉంటారని స్పష్టం చేశారు సంజయ్ రౌత్.
Also Read : ఎన్నికల సంఘం మోదీకి దాసోహం