Arvind Kejriwal Slams : ఎల్జీ నిర్వాకం కేజ్రీవాల్ ఆగ్రహం
ఎన్నికలను ప్రభావితం చేసే ఛాన్స్
Arvind Kejriwal Slams : ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల నియామకంపై కీలకమైన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఈనెల 22న బుధవారం ఉదయం 11 గంటలకు పారదర్శకంగా ఎన్నికలు చేపట్టాలని ఆదేశించింది. ఇదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా జారీ చేసిన నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదని స్పష్టం చేసింది. దీంతో ఒక రకంగా ఎల్జీకి బిగ్ షాక్ .
ఇదిలా ఉండగా ఢిల్లీ ఎల్జీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal Slams) ఆరోపించారు. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం ఎంసీడీ ఎన్నికలు ముగిశాయి. వాస్తవానికి అత్యధిక మెజారిటీ కలిగి ఉంది ఆప్. గత 15 ఏళ్లుగా బీజేపీ తన గుప్పిట్లో ఉన్న ఎంసీడీని కోల్పోయింది .
దీంతో ఎల్జీని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తోందంటూ ఆప్ ఆరోపించింది. ఈ మేరకు కోర్టును ఆశ్రయించింది. కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎల్జీ ఇచ్చిన ఆదేశాలు చెల్లవని పేర్కొంది.
ఇప్పటికీ మూడు సార్లు ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ , స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. చివరకు కోర్టు పరిధిలోకి చేరడంతో తుది తీర్పు వెలువరించింది ధర్మాసనం.
ఢిల్లీ ప్రభుత్వం తన అభిప్రాయాలను సుప్రీంకోర్టు ముందు తమ అభిప్రాయాలను ప్రదర్శించకుండా బలవంతంగా నిరోధించేందుకు ఎల్జీ సక్సేనా ప్రయత్నించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి ఈనెల 22న తెర పడనుంది.
Also Read : 22న ఢిల్లీ మేయర్ ఎన్నిక – సుప్రీం