Draupadi Murmu Mahashivratri 2023 : శివుడు దయగల దేవుడు – ద్రౌపది ముర్ము
ఈషా మహా శివరాత్రి వేడుకల్లో రాష్ట్రపతి
Draupadi Murmu Mahashivratri 2023 : ఆది యోగి సద్గురు సన్నిధిలో మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొనడం అత్యంత ఆనందంగా ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తమిళనాడు లోని కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవన్(Jaggi Vasudev) ఆధ్వర్యంలో ఈషా ఫౌండేషన్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
ప్రపంచానికి ఆధ్యాత్మికత పరంగా పాఠం నేర్పిన చరిత్ర భారత దేశానికి ఉందన్నారు రాష్ట్రపతి. ఈ పర్వదినం రోజున తాను ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రపంచంలోని నలుమూలల్లో మన పూర్వ గురువుల బోధనలను ప్రచారం చేయడంలో కీలకమైన పాత్ర సద్గురు జగ్గీ వాసుదేవన్(Jaggi Vasudev) పోషిస్తున్నారంటూ కొనియాడారు ద్రౌపది ముర్ము(Draupadi Murmu Mahashivratri 2023) సద్గురు జీ సమక్షంలో మనం కూడా పాల్గొంటున్నందుకు గర్వపడాలని అన్నారు .
ప్రస్తుతం యావత్ లోకం పర్యావరణ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రకృతి మాతతో కలిసి జీవిస్తే సంతోషకరమైన జీవితాన్ని పొందవచ్చని సద్గురు నిరూపిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన పర్యావరణం కోసం సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రతి చోటా భూమి వేడికి గురవుతోందని దాని నుంచి ఉపశమనం పొందాలంటే పర్యావరణాన్ని కాపాడు కోవాలని ప్రయత్నం చేస్తున్నారని ప్రశంసించారు.
ఈ మహా శివరాత్రి మనలోని అంధకారాన్ని పోగొట్టి మనందరినీ మరింత సంతృప్తమైన ఆనందాన్ని కలిగిస్తుందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ మార్గంలో మీరంతా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.
Also Read : శివ నామ స్మరణం ఈషామయం