Nitish Kumar Appeal : ఇకనైనా కాంగ్రెస్ మేలుకోవాలి – నితీశ్
బీహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు
Nitish Kumar Appeal : జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో విద్వేషాలను సృష్టిస్తూ దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీ మేలుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మరోసారి చేజేతులారా బీజేపీకి అవకాశం ఇచ్చినట్లవుతుందని హెచ్చరించారు నితీశ్ కుమార్(Nitish Kumar Appeal) . రాష్ట్రంలోనే కాదు దేశంలో సైతం బీజేపీ చాపకింద నీరులా ప్రవహిస్తోందని అది కేవలం మతాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపించారు.
ఇప్పటికైనా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మేలుకోవాలని, భావ సారూప్యత కలిగిన పార్టీలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అపర చాణక్యుడిగా పేరు పొందిన సల్మాన్ ఖుర్షీద్ తో సుదీర్ఘ సమయం గడిపారు. కీలక అంశాలపై చర్చించారు. వీరిద్దరూ సీపీఎం 11వ మహాసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్(Nitish Kumar Appeal) బీజేపీకి వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇలా ఎంత కాలం దాడులతో ముందుకు సాగుతామని ప్రశ్నించారు.
ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరం టార్గెట్ అవుతూ వస్తాం. ఆరోజు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. రాబోయే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు నితీశ్ కుమార్. లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు బీహార్ సీఎం. ప్రతిపక్ష పార్టీల కూటమిని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో శ్రమించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Also Read : ఎల్ఐసీ..ఎస్బీఐని ఆదేశించింది ఎవరు