Eknath Shinde Win : విల్లు బాణం షిండే దరహాసం
సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న సీఎం
Eknath Shinde Win : శివసేన పార్టీ ఎవరిదనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. దివంగత బాలా సాహెబ్ ఠాక్రే కేవలం హిందువుల కోసం స్థాపించారు శివసేనను. ఆ తర్వాత అది పార్టీగా మారింది. శివసేన, కాంగ్రెస్ , ఎన్సీపీ కలిసి మహా వికాస్ అఘాడీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శివసేనలో నెంబర్ 2 గా ఉన్న ఏక్ నాథ్ షిండే(Eknath Shinde Win) ఏకంగా తిరుగుబాటు ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీతో కలిసి ఎంవీఏ సర్కార్ ను కూల్చారు. అనంతరం షిండే సారథ్యంలో శివసేన షిండే వర్గం, బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత శివసేన పార్టీ గుర్తు తమదేనంటూ ప్రకటించారు ఏక్ నాథ్ షిండే. దీనిపై రాద్దాంతం చోటు చేసుకుంది. అటు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇటు ఏక్ నాథ్ షిండే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టును ఆశ్రయించారు.
చివరకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 18 శుక్రవారం ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. గతంలో శివసేన పార్టీకి కేటాయించిన విల్లు బాణం గుర్తును షిండే శివసేన పార్టీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై నిప్పులు చెరిగారు ఉద్దవ్ ఠాక్రే.
కేంద్ర ఎన్నికల సంఘం మోదీకి దాసోహమైందని ఆరోపించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు. గుర్తు కేటాయింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ముందస్తుగా షిండే సైతం ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. తాము కూడా సుప్రీంను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.
Also Read : ఇకనైనా కాంగ్రెస్ మేలుకోవాలి – నితీశ్