Mukesh Ambani Visit : సోమనాథ్ ఆలయంలో అంబానీ పూజలు
రూ. 1.5 కోట్లు విరాళం ప్రకటించిన చైర్మన్
Mukesh Ambani Visit : మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముకేశ్ అంబానీ తన కొడుకు ఆకాష్ అంబానీతో కలిసి సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు(Mukesh Ambani Visit). అంబానీ ఫ్యామిలీ గతంలో ఈ గుడిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు చేశారు.
ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ముకేశ్ అంబానీ, ఆకాష్ అంబానీలు. ప్రస్తుతం రిలయన్స్ జియో చైర్మన్ గా ఉన్నారు ఆకాష్ అబానీ. అంబానీ కుటుంబానికి ముందు నుంచి సోమనాథ్ ఆలయం అంటే అభిమానం అంతకు మించిన గౌరవం కూడా.
ప్రభాస్ పటాన్ లోని మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమనాథ్ టెంపులను(Somnath Temple) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అత్యంత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం భారత దేశంలో పేరొందిన వ్యాపారవేత్తలలో ఒకరిగా ఉన్నారు ముకేశ్ అంబానీ.
ఇద్దరు గుజరాతీలు ప్రపంచంలోనే టాప్ లో కొనసాగుతున్నారు. వారిలో ఒకరు అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతం అదానీ కాగా మరొకరు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ. అంతకు ముందు ముకేశ్ అతబానీ , ఆకాష్ అంబానీలకు సోమనాథ్ ఆలయ(Somnath Temple) ట్రస్టు చైర్మన్ పీకే లాహిరి, కార్యదర్శి యోగేంద్ర భాయ్ దేశాయ్ ఘన స్వాగతం పలికారు.
ఇక ఆలయంలో మేకేశ్ , ఆకాష్ అంబానీలు దేవత ముందు అభిషేకం అర్పించారు. ఆకాష్ అంబానీకి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు చేశారు రిలయన్స్ సంస్థ.
Also Read : ఆధునిక కాలానికి ఆది యోగి