CBI Accepts Sisodia : సిసోడియా విన్న‌పం సీబీఐ ఆమోదం

త‌న‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని కోరిన డిప్యూటీ సీఎం

CBI Accepts Sisodia : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో కీల‌క పాత్ర పోషించార‌ని, తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాకు ఊర‌ట ల‌భించింది. ఆదివారం త‌మ ఆఫీసుకు విచార‌ణ నిమిత్తం హాజ‌రు కావాల‌ని నోటీసులు జారీ చేసింది. ఇప్ప‌టికే 9 మందిని ఈ కేసులో అరెస్ట్ చేసింది. స‌మ‌న్లు అందుకున్న మ‌నీష్ సిసోడియా త‌న‌కు స‌మ‌యం కావాల‌ని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ను(CBI Accepts Sisodia) అభ్య‌ర్థించారు. దీనిపై ఆలోచించిన సీబీఐ ఈ మేర‌కు ఆమోదం తెలిపింది.

అయితే విచార‌ణ‌కు సంబంధించి ఇంకా తేదీ ఖ‌రారు చేయ‌లేదు ద‌ర్యాప్తు సంస్థ‌. ఇదిలా ఉండ‌గా తాను ఢిల్లీ బ‌డ్జెట్ త‌యారీలో బిజాగా ఉన్నాన‌ని ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రు వ‌ర‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని ఇవాళ మ‌నీష్ సిసోడియా(CBI Accepts Sisodia) అభ్య‌ర్థించారు. ఈ మేర‌కు డిప్యూటీ సీఎం చేసిన అభ్య‌ర్థ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది సీబీఐ. పూర్వ ప‌రాల‌ను ప‌రిశీలించిన ద‌ర్యాప్తు సంస్థ ఓకే చెప్పింది.

త్వ‌ర‌లో కొత్త‌గా మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే మ‌నీష్ సిసోడియాను ఎప్పుడు విచారిస్తుంద‌నే విష‌యం ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. జారీ చేసే స‌మ‌న్ల‌లో తేదీ, స‌మ‌యం, ప్లేస్ నిర్ణ‌యిస్తుంది సీబీఐ .

ఇదిలా ఉండ‌గా మ‌నీష్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ బ‌డ్జెట్ ప్ర‌క్రియ చివ‌రి ద‌శ‌లో ఉంద‌న్నారు. దానిని స‌కాలంలో పూర్తి చేయాలంటే ప‌గ‌లు రాత్రి కృషి చేయాల్సి ఉంటుంద‌న్నారు. ఈ త‌రుణంలో తాను సీబీఐ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని , స‌మ‌యం ఇవ్వాల‌ని కోరిన‌ట్లు తెలిపారు. తాను ఏ స‌మ‌యంలోనైనా ఎలాంటి స‌వాల్ నైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు డిప్యూటీ సీఎం.

Also Read : పార్టీ గుర్తు కోసం రూ. 2 వేల కోట్లు డీల్

Leave A Reply

Your Email Id will not be published!