Assam CM Himanta Biswa Sarma : పవర్ లోకి వస్తే ప్రజా పాలన – సీఎం
పవర్ లోకి వస్తే ప్రజా పాలన
Assam CM Himanta Biswa Sarma : అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకు వచ్చిన కేంద్ర సంక్షేమ పథకాలు మేఘాలయలో సరిగా అమలు కావడం లేదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మేఘాలయలో పర్యటించారు. ఈ సందర్బంగా కొన్ని కుటుంబాలకే ఈ పథకాలు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పవర్ లోకి వస్తే ప్రజా పాలన అందిస్తామని చెప్పారు హిమంత బిస్వా శర్మ(Assam CM Himanta Biswa Sarma).
అస్సాంలో తమ సర్కార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను మేఘాలయలో కూడా అమలు చేస్తామని ప్రకటించారు. పీఎం ఆవాస్ యోజన వంటి పథకాలు ఏ ఒక్కరికీ అందినట్టు తనకు అనిపించడం లేదన్నారు అస్సాం సీఎం.
కేంద్ర పథకాల ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి చేరాలని. కానీ ఆ లక్ష్యం ఇంకా నెరవేరక పోవడం బాధాకరమన్నారు హిమంత బిస్వా శర్మ. సంక్షేమ పథకాల ముఖ్య ఉద్దేశం నిరుపేదలు, పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరాలని. ప్రతి ఒక్క పథకం కింది స్థాయి వ్యక్తులకు చేరినప్పుడే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందన్నారు సీఎం.
ఇదిలా ఉండగా మేఘాలయ లోని మహేంద్ర గంజజ్ , రోంగ్ జెంగ్ , మెండిపత్తర్ , ఖారా కుట్టాలలో జరిగిన బీజేపీ వరుస ర్యాలీలలో ఆయన పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఏడాది అస్సాంలో లక్ష మంది యువతకు జాబ్స్ ఇస్తామని ప్రకటించామని ఇప్పటి వరకు 50 వేల మందికి ఇచ్చామని తెలిపారు. త్వరలోనే మిగతా 50 వేల మందికి కూడా జాబ్స్ ఇస్తామన్నారు సీఎం.
Also Read : అప్ డేట్ అయితేనే అందుకోగలం – మోదీ