YS Sharmila Slams TS Govt : రాచరిక పాలన మహిళలంటే చులకన
నిప్పులు చెరిన వైఎస్సార్ టీపీ చీఫ్
YS Sharmila Slams TS Govt : రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల. తాను ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రమే ప్రస్తావిస్తున్నానని కానీ దానిని తట్టుకోలేక పోతోందంటూ బీఆర్ఎస్ రాష్ట్ర సర్కార్ పై మండిపడ్డారు.
ప్రజా ప్రస్థానంలో భాగంగా పోలీసులు తనను అడ్డు కోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆరోపించారు. ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. కానీ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల.
ఈ రాష్ట్రంలో ప్రశ్నించడం, ప్రజల తరపున మాట్లాడటం నేరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు రాజ్యం నడుస్తోందని అన్నారు. పాలన పడకేసిందని, వ్యవస్థలను నిర్వీర్యం చేసి పాలనను పూర్తిగా నిద్రపోయేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు వైఎస్ షర్మిల. ప్రత్యేకించి మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేదన్నారు. అది బీఆర్ఎస్ పార్టీ కాదని బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ మండిపడ్డారు.
తాను ప్రజల కోసం పాదయాత్ర చేస్తుంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల(YS Sharmila Slams TS Govt). ఇప్పటి వరకు 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తయిందని చెప్పారు. తాను వ్యక్తిగతంగా ఎవరిపై దాడికి దిగలేదన్నారు. కేవలం పదవుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ల ఆగడాలను మాత్రమే ప్రశ్నించానని అన్నారు.
ఓ మహిళను పట్టుకుని ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆమె బయట పెట్టారు.
Also Read : వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్