Uddhav Thackeray Amit Shah : మొగాంబో ఖుష్ హువా – ఠాక్రే
అమితా షా కామెంట్స్ మాజీ సీఎం ఫైర్
Uddhav Thackeray Amit Shah : మరాఠాలో రాజకీయం మరింత వేడిని రాజేస్తోంది. బీజేపీ, శివసేన బాల్ సాహెబ్ ఠాక్రే పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ హీటెక్కిస్తున్నారు. ఇదే క్రమంలో శివసేన పార్టీకి సంబంధించిన గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం భగ్గుమనేలా చేసింది.
దివంగత బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీకి ముందు నుంచి విల్లు బాణం ఉంది. ఇదిలా ఉండగా శివసేనలో తిరుగుబాటు జెండా ఎగుర వేసి ప్రస్తుతం సీఎంగా ఉన్న ఏక్ నాథ్ షిండే పార్టీకి ఈ గుర్తులను కేటాయించడం తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీనిపై కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా సరైన నిర్ణయమని పేర్కొనడంపై భగ్గుమన్నారు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray Amit Shah) .
ప్రముఖ హిందీ సినిమా మిస్టర్ ఇండియా సినిమాలో అత్యంత పేరొందిన డైలాగ్ మొగాంబో షుఖ్ హువా ను అమిత్ షాకు ఆపాదించారు ఉద్దవ్ ఠాక్రే. వీరే నేటి మొగాంబోలు..అసలు మొగాంబో లాగా వారు ప్రజలు ఒకరితో ఒకరు పోరాడాలని కోరుకుంటారు. తద్వారా వారు అధికారాన్ని అనుభవిస్తారంటూ మండిపడ్డారు మాజీ సీఎం.
ఈ తీర్పు దొంగలకు అనుకూలంగా వచ్చిందని ఆరోపించారు ఉద్దవ్ ఠాక్రే. 1993 వరుస పేలుళ్ల సమయంలో శివ సైనికులు ముంబైని రక్షించారని , ఇప్పుడు హిందుత్వం గురించి మాట్లాడే వారు అప్పుడు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు . తాను సీఎం కావడానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పాదాలకు లొంగి పోయానని షా చేసిన ఆరోపణలపై సీరియస్ అయ్యారు.
Also Read : కర్ణాటకలో జేపీ నడ్డా టూర్