Akhilesh Yadav MLAs Protest : అసెంబ్లీ ఎదుట అఖిలేష్ ధర్నా
పోలీసులతో ఎస్పీ చీఫ్ వాగ్వాదం
Akhilesh Yadav MLAs Protest : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాదీకి చెందిన చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో సమావేశాలకు ఆటంకం కలిగిస్తుండడంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. వారిని నెట్టి వేసేందుకు యత్నించారు. దీంతో ఎస్పీ చీఫ్ కు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బలవంతంగా ధర్నా స్థలం నుంచి తరలించారు.
ఇదిలా ఉండగా ఈ ఏడాది 2023కు సంబంధించి యూపీలో కొలువు తీరిన యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం బడ్జెట్ ను సోమవారం ప్రవేశ పెట్టింది. దీనిని నిరసిస్తూ ఆందోళన చేపట్టేందుకు పిలుపునిచ్చారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఇది పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. బడ్జెట్ ను ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు(Akhilesh Yadav MLAs Protest). ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్ల కార్డులు పట్టుకుని ప్రదర్శన చేపట్టారు.
రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, కనీసం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎస్పీ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీకి చెందిన 100 మంది ఎమ్మెల్యేలు యూపీ అసెంబ్లీ ఎదుట నిరసన చేపట్టారు. బుల్డోజర్లు, చెరకు బకాయిలు, నిరుద్యోగం, లా అండ్ ఆర్డర్ పేరుతో ప్ల కార్డులు ప్రదర్శించారు.
అసెంబ్లీ ఆవరణలోని చౌదరి చరణ్ సింగ్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్ సింగ్ యాదవ్ ఎర్ర టోపీ ధరించి పాల్గొన్నారు.
Also Read : కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఈడీ దాడులు