Yadagirigutta Brahmotsavams 2023 : 21 నుంచి ‘గుట్ట’ ఉత్సవాలు
మార్చి 3 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు
Yadagirigutta Brahmotsavams 2023 : భక్తుల కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా కొలిచే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్దమైంది. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆలయాన్ని పునర్ నిర్మించింది. భారీ ఎత్తున ఖర్చు చేసింది.
ఫిబ్రవరి 21 మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు(Yadagirigutta Brahmotsavams 2023) ప్రారంభం కానున్నాయి. ఆలయ కమిటీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. వచ్చే నెల మార్చి 3 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ప్రారంభం రోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. స్వస్తీ వాచనం, రక్షా బంధనం చేపడతారు.
సాయంత్రం మృత్సంగ్రహణం , అంకురారోహణతో మొదటి రోజు ముగుస్తాయి. పునర్ నిర్మాణంతో మొదటిసారిగా బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో భారీ ఎత్తున నిర్వహించేలా చేస్తోంది ఆలయ కమిటీ. షోలాపూర్ కు చెందిన చాట్ల ప్యాట్నీ సెంటర్ యాజమాన్యం పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించింది. ఇక స్వామి వారి కళ్యాణోత్సవం రోజున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ఉత్సవాలలో భాగంగా 22న అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, భేరి పూజ నిర్వహిస్తారు. 23న అలంకార, శేష వాహన సేవలు ఉంటాయి. 24న అలంకార సేవ, హంస వాహన సేవ , 25న శ్రీకృష్ణాలంకార సేవ , పొన్న వాహన సేవ, గిరిధారి అలంకార సేవ, సింహ వాహన సేవ ఉంటుంది.
27న జగన్మోహని సేవ, అశ్వ వాహన సేవ, ఎదుర్కోలు ఉత్సవం , 28న శ్రీరామ అలంకర సేవ, గజవాహన సేవ, తిరు కళ్యాణోత్సవం , మార్చి 1న గరుడ వాహన సేవ , దివ్య విమాన రథోత్సవం , 2న మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, పుష్ప యాగం , 3న అష్టోత్తర శతఘట్టాభిషేకం, డోలోత్సవంతో ముగుస్తాయి ఉత్సవాలు.
Also Read : ఆధునిక కాలానికి ఆది యోగి