PM Modi Uttarakhand Job Mela : ఉత్తరాఖండ్ లో భారీగా కొలువుల భర్తీ
ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
PM Modi Uttarakhand Job Mela : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఉత్తరాఖండ్ లో భారీగా కొలువులను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. సుదూర ప్రాంతాలను రోడ్డు, రైలు, ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. ఇది పర్యాటక రంగం విస్తరణకు మరింత దోహద పడుతుందని అన్నారు ప్రధానమంత్రి(PM Modi Uttarakhand) . డెహ్రాడూన్ లో అసిస్టెంట్ టీచర్లకు నియామక పత్రాలను పంపిణీ చేసేందుకు రోజ్ గార్ మేళాలో నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు.
ఉత్తరా ఖండ్ లోని యువత తమ గ్రామాలకు తిరిగి వచ్చేలా కేంద్ర సర్కార్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఉపాధి కల్పన కోసం మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు ఉంటాయని ప్రధానమంత్రి చెప్పారు. కొండలపై ఉన్న నీరు యువశక్తి సాధారణంగా కొండ ప్రాంతం ద్వారా ఉపయోగించ బడదన్న పాత సామెతను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి. అందుకే ఉత్తరాఖండ్ యువత తమ గ్రామాలకు తిరిగి వచ్చేలా కేంద్ర సర్కార్ నిరంతరం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
ఇందు కోసం కొండల్లో కొత్తగా ఉపాధిని కల్పించడం , స్వయం ఉపాధి పెంపొందించుకునేలా చేస్తున్నామని అన్నారు నరేంద్ర మోదీ. గతంలో లాగా కాకుండా ఈసారి మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెట్టామన్నారు. దీని కారణంగా భారీ ఎత్తున కొలువులు(Job Mela) వస్తాయని చెప్పారు ప్రధానమంత్రి.
గతంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు ప్రధానమంత్రి. అపారమైన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోందన్నారు నరేంద్ర మోదీ. ప్రతి గ్రామంలో ఇంటర్నెట్, డిజిటల్ సేవా కేంద్రాలు నెలకొల్పడం జరిగిందన్నారు. దీని వల్ల ఉపాధి దొరుకుతోందన్నారు.
Also Read : మెటా సబ్ స్క్రిప్షన్ సర్వీస్ స్టార్ట్