Shelly Oberoi Eqbal : ఢిల్లీ పీఠంపై షెల్లీ..ఇక్బాల్

మేయ‌ర్ గా ఒబేరాయ్..డిప్యూటీ మేయ‌ర్ ఇక్బాల్

Delhi Mayor Shelly Oberoi Eqbal : భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ సక్సేనాను అడ్డం పెట్టుకుని ఢిల్లీ పీఠంపై ఎలాగైనా నామినేటెడ్ స‌భ్యుల‌తో చేజిక్కించు కోవాల‌ని వేసిన వ్యూహం బెడిసి కొట్టింది. ఎట్ట‌కేల‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవ‌సం చేసుకుంది. ఇప్ప‌టికీ మూడుసార్లు వాయిదా ప‌డింది. తాజాగా జ‌రిగిన మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌ల్లో ఆప్ కు చెందిన షెల్లీ ఒబెరాయ్(Delhi Mayor Shelly Oberoi) మేయ‌ర్ గా, మ‌హమ్మ‌ద్ ఇక్బాల్ ఎన్నిక‌య్యారు.

వీరితో పాటు స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుల‌ను కూడా ఎన్నుకోనున్నారు. మొత్తంగా కాషాయానికి కోలుకోలేని షాక్ త‌గిలింది. మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ల ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డంతో ఢిల్లీలో ఆప్ సంబురాలు అంబ‌రాన్ని అంటాయి. విజ‌యోత్స‌వ వేడుక‌లు అనంత‌రం ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. గూండాలు ఓడి పోయార‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియో షీలా, ఇక్బాల్ ల‌ను అభినందించారు.

ఒబెరాయ్ కు 150 ఓట్లు రాగా భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. గూండాలు ఓడి పోయారు..ప్ర‌జ‌లు గెలిచారంటూ పేర్కొన్నారు. అనంత‌రం గెలుపొందిన షెల్లీ, ఇక్బాల్ లు విజ‌య చిహ్నాన్ని చూపించారు. ఆప్ పై న‌మ్మ‌కం పెట్టినందుకు, మ‌రోసారి గెలిపించినందుకు ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు తాము ఎల్ల‌వేళ‌లా రుణ‌ప‌డి ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం కేజ్రీవాల్ , డిప్యూటీ సీఎం సిసోడియాలు.

శుక్ర‌వారం ఉన్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు ప్ర‌కారం డిప్యూటీ మేయ‌ర్ , శ‌క్తివంత‌మైన స్టాండింగ్ క‌మిటీలోని ఆరుగురు స‌భ్యుల‌తో స‌హా మిగిలిన ఎన్నిక‌ల‌కు ఒబేరాయ్ అధ్య‌క్ష‌త వ‌హించారు.

Also Read : నిన్న మాజీ ప్రొఫెస‌ర్ నేడు ఢిల్లీ మేయ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!