Pawan Khera Arrested : పవన్ ఖేరా అరెస్ట్..కాంగ్రెస్ ఫైర్
సుప్రీంకోర్టును ఆశ్రయించిన పార్టీ
Pawan Khera Arrested : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అవమానించారనే ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, స్పోక్స్ పర్సన్ పవన్ ఖేరాను గురువారం అరెస్ట్ చేశారు. విమానంలో ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ కు తీసుకు వెళ్లిన తర్వాత ఢిల్లీ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. దాదాపు 50 మంది కాంగ్రెస్ నాయకులు విమానాన్ని బయలుదేరేందుకు నిరాకరించారు. నిరసన చేపట్టారు. పవన్ ఖేరా అరెస్ట్ ను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశానికి రాయ్ పూర్ కు వెళుతున్న కాంగ్రెస్ బృందంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఇండిగో విమానం ఎక్కారు. ఆ తర్వాత బలవంతంగా బయటకు వెళ్లాల్సి వచ్చింది.
బీజేపీ నాయకుడి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అస్సాం పోలీసులు. ఈ మేరకు ఢిల్లీకి చేరుకున్న పోలీసులు పవన్ ఖేరాను(Pawan Khera Arrested) అదుపులోకి తీసుకున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, తన స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నారు పవన్ ఖేరా.
తాను వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని తాను చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. తాను పోరాడేందుకు రెడీగా ఉన్నానని ప్రకటించారు. తన సామాను తనిఖీ చేయాల్సి ఉందని ముందుగా చెప్పారు.
ఆ తర్వాత డీసీపీ వస్తారని తెలిపారు. కానీ అబద్దం చెప్పి తనను అదుపులోకి తీసుకున్నారంటూ ఆరోపించారు పవన్ ఖేరా(Pawan Khera). తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తప్పును ప్రశ్నించే హక్కు తనకు ఉందన్నారు.
Also Read : ఫ్లైట్ నుంచి దింపడం చిల్లర చర్య – సీఎం