KTR : జూబిలెంట్ గ్రూప్ ఫెసిలిటీ సెంట‌ర్

ధ‌న్య‌వాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్

KTR  Jubilant Group : ప్ర‌ముఖ జూబిలెంట్ గ్రూప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ‌లో ఫెసిలిటీ సెంట‌ర్ ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బ‌యో ఏషియా స‌ద‌స్సు హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్(KTR  Jubilant Group) తో జూబిలెంట్ గ్రూప్ ఫౌండ‌ర్ , కో చైర్మ‌న్ హ‌రి ఎస్ భార్జియా సమావేశం అయ్యారు.

తెలంగాణ ప్ర‌భుత్వం పెట్టుబ‌డిదారుల‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతోంది. వారికి అన్ని రకాలుగా స‌పోర్ట్ గా నిలుస్తోంది. ఇప్ప‌టికే ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ , త‌దిత‌ర రంగాల‌కు సంబంధించిన కంపెనీలు ఎక్కువ‌గా ఇక్క‌డ కొలువు తీరాయి. ఇందులో భాగంగా జూబిలెంట్ గ్రూప్ తెలంగాణ ప్ర‌భుత్వంతో కీల‌క ఒప్పందం చేసుకుంది. అనంత‌రం కీల‌క విష‌యం వెల్ల‌డించింది. 

ఇక స‌ద‌రు సంస్థ ఫార్మాస్యూటిక‌ల్స్ , కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్ మెంట్ స‌ర్వీసెస్ , త‌దిత‌ర రంగాల‌లో కొన‌సాగుతోంది. అంతే కాకుండా నావెల్ డ్ర‌గ్స్ , లైఫ్ సైన్స్ ఇంగ్రీడియంట్స్ , వ్య‌వసాయ ఉత్ప‌త్తులు , పెర్ ఫార్మ‌న్స్ పాలిమ‌ర్స్ , ఫుడ్ స‌ర్వీస్ , ఫుడ్, ఆటో , క ఏరో స్పేస్ , ఆయిల్ ఫీల్డ్ రంగాల‌లో భాగ‌స్వామ్యం ఉంది జూబిలెంట్ గ్రూప్ కు. స‌ద‌స్సులో జూబిలెంట్ గ్రూప్ తో సంత‌కం చేసిన అనంత‌రం కేటీఆర్ మాట్లాడారు.

ఫార్మా రంగంలో జూబిలెంట్ గ్రూప్ టాప్ లో కొన‌సాగుతోంద‌న్నారు. రాష్ట్ర స‌ర్కార్ ప‌రిశ్ర‌మ‌ల‌కు పెద్ద ఎత్తున స‌పోర్ట్ చేస్తోంద‌ని చెప్పారు. ఇక ముందు కూడా తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారు. హైద‌రాబాద్ బ‌యో టెక్నాల‌జీ, లైఫ్ సైన్సెస్ కు కేరాఫ్ గా మారింద‌ని అన్నారు మంత్రి కేటీఆర్(KTR).

Also Read : కొలువుల కోత‌పై ఎరిక్‌స‌న్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!