Amrita Pal Singh : హింసకు పోలీసులే కారణం
అమృతపాల్ సింగ్ ఆరోపణ
Amrita Pal Singh : పంజాబ్ లోని అమృత్ సర్ లో పోలీస్ స్టేషన్ పై దాడి చేయడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు భ్రిందన్ వాలే 2.0 గా ప్రసిద్ది పొందిన అమృత పాల్ సింగ్. రాడికల్ బోధకుడిగా, ఖలిస్తాన్ సానుభూతి పరుడిగా కొంత కాలంగా చురుకుగా పాల్గొంటున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదిలా ఉండగా దీప్ సిద్దు ప్రారంభించిన రాడికల్ సంస్థ వారిస్ పంజాబ్ దేకి అమృత పాల్ సింగ్(Amrita Pal Singh) నాయకత్వం వహిస్తున్నారు. తన ముఖ్య సహాయకుడిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారీ నిరసనకు పిలుపు ఇచ్చాడు.
ఈ సందర్భంగా మొత్తం ఘటనపై స్పందించాడు. జాతీయ మీడియాతో మాట్లాడాడు అమృత పాల్ సింగ్ (Amrita Pal Singh). అమృత్ సర్ లో జరిగిన హింసకు పంజాబ్ పోలీసులే కారణమని ఆరోపించారు. గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన నటుడు , కార్యకర్త దీప్ సిద్దూ ప్రారంభించాడు వారిస్ పంజాబ్ దే. ఇది తీవ్రవాద సంస్థ. దీనికి అమృత పాల్ సింగ్ లీడర్ గా ఉన్నాడు. పోలీసులు తన సహాయకుడు లవ్ ప్రీత్ సింగ్ అకా అలియాస్ అకా తూపాన్ సింగ్ పై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు.
అందు వల్ల వారిస్ పంజాబ్ దే మద్దతుదారులు అతడిని ఉంచిన అమృత్ సర్ లోని అజ్నాలా వద్ద పోలీసులను కలిసేందుకు వెళ్లారని చెప్పారు. అయితే మీడియా మొత్తం ఈ సమస్యను తప్పుగా చిత్రీకరించిందని ధ్వజమెత్తారు. వాస్తవాలు తెలుసుకోకుండా తమను టార్గెట్ చేశారంటూ ఆరోపించాడు. పోలీసులు ప్రజలపై లాఠీ ఛార్జీ జరపక పోయి ఉంటే ఇంతటి హింస జరిగి ఉండేది కాదన్నారు.
Also Read : వాళ్లు వారసులు కాలేరు – మాన్