CM Shinde : వాళ్లు బాల్ ఠాక్రేను వదిలేశారు – షిండే
మాజీ సీఎం ఉద్దవ్..రౌత్ లపై సీఎం ఫైర్
CM Shinde : మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎంపీ సంజయ్ రౌత్ ను ఏకి పారేశారు. వాళ్లకు తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. శివ సేన పార్టీని ఏర్పాటు చేసిన బాలా సాహెబ్ ఠాక్రేను విస్మరించారని, ఆయనను వాళ్లు ఏనాడో మరిచి పోయారంటూ ఎద్దేవా చేశారు సీఎం షిండే(CM Shinde). అధికార వ్యామోహంతో పార్టీని, విలువలకు తిలోదకాలు ఇచ్చారంటూ ధ్వజమెత్తారు.
రాష్ట్రం అభివృద్ది చెందాలంటే నిధులు కావాలి. రాష్ట్రాలు తప్పనిసరిగా కేంద్రంతో సంబంధం పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఇందులో తాము చేసిన తప్పేమిటో తమను విమర్శిస్తున్న వాళ్లు, తమపై ఆడి పోసుకుంటున్న వాళ్లు ఆలోచించాలన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఉద్దవ్ ఠాక్రే, సంజయ్ , ఆదిత్యా ఠాక్రే కు అలవాటుగా మారిందని ఆరోపించారు ఏక్ నాథ్ షిండే(CM Shinde). రాష్ట్రం కోసం అహాన్ని పక్కన పెట్టాలన్నారు. ఇందులో తప్పేమీ, ముప్పేమీ లేదన్నారు.
అభివృద్ది సాధించేందుకు ఒకరు రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ఫేస్ బుక్ , ట్విట్టర్ , వాట్సాప్ , లింక్డ్ ఇన్ లలో పోస్ట్ లు పెట్టినంత మాత్రాన పనులు కావన్నారు ఏక్ నాథ్ షిండే. 2020 నుండి కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో సీఎంగా బాధ్యతలు నిర్వహించాల్సిన ఉద్దవ్ ఠాక్రే తన స్వంత ఇంట్లో ఉండి పాలన సాగించారని ధ్వజమెత్తారు సీఎం. కనీసం జిల్లాలకు కూడా వెళ్లలేదన్నారు. ఇక ఎన్నికల సంఘానికి స్వేచ్చ ఉంటుంది. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుందన్నారు షిండే.
Also Read : పాశ్చాత్య మనస్తత్వానికి చెక్ – ఠాగూర్