Shashi Tharoor : బిల్కిస్ బానోకు అండగా నిలవాలి
పిలుపునిచ్చిన ఎంపీ శశి థరూర్
Shashi Tharoor Bilkis Bano : ఈ దేశంలో విద్వేష పూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది ప్రమాదరకం. ఇదే సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసు విషయంలో ఆమెకు అండగా నివాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ శశి థరూర్. రాయ్ పూర్ వేదికగా జరిగిన 85వ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తగా కనిపించారు. ఇది పక్కన పెడితే కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్బంగా పలు సూచనలు కూడా చేశారు.
ఈ దేశంలో బీజేపీ కొలువు తీరాక దాడులు మరింత పెరిగాయి. దాని వెనుక కచ్చితమైన కారణం ఉండి ఉంటుంది. కానీ దానికి మతం అనే రంగును పులిమి రాజకీయం చేస్తున్నారంటూ శశి థరూర్ (Shashi Tharoor Bilkis Bano) ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి బిల్కిస్ బానో కేసు అని చెప్పారు. విచిత్రం ఏమిటంటే జీవిత ఖైదు పడిన నిందితులకు బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. ఇందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని ఏమని పిలవాలని నిలదీశారు.
సమస్యలపై పోరాడటం ఒక్కటే కాదు బాధితులకు భరోసా ఇవ్వడం కూడా పార్టీ ఇక ముందు నుంచి పని చేయాలని స్పష్టం చేశారు శశి థరూర్. దేశంలోని లౌకిక పునాదులను బలోపేతం చేయడం ముఖ్యమన్నారు. కొన్ని సమస్యలపై వైఖరిని తీసుకోకుండా ఉండాలనే ధోరణి బీజేపీని మాత్రమే ప్రభావితం చేస్తుందన్నారు ఎంపీ. బిల్కిస్ బానో ఆగ్రహం, క్రిస్టియన్ చర్చీలపై దాడులు, గో సంరక్షణ పేరుతో హత్యలు, ముస్లింల ఇళ్ల ను బుల్డోజర్ తో కూల్చి వేతలను ఆపాలని కోరారు.
Also Read : వ్యవస్థలో లోపం ఆత్మహత్యల పర్వం