Medico Preethi Saif : ప్రీతిని చంపిన సైఫ్ ను ఉరి తీయండి
డిమాండ్ చేసిన గిరిజన సంఘాలు
Medico Preethi Saif : సీనియర్ల వేధింపులతో నాలుగు రోజుల కిందట సూసైడ్ కు పాల్పడిన వరంగల్ జిల్లా గిర్నితాండాకు చెందిన ధరావత్ ప్రీతి ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ కన్ను మూసింది. ఈ సందర్భంగా ప్రీతి(Medico Preethi Saif) మృతికి కారకులైన సీనియర్లతో పాటు కీలకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాదు ఆమె మృతికి కారకుడిగా భావిస్తున్న , ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ను ఉరి తీయాలని డిమాండ్ చేశాయి.
ప్రీతి కుటుంబానికి రూ. 5 కోట్ల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ఆమె ఫ్యామిలీలో ఒకరికి గ్రూప్ -1 పోస్టు ఇవ్వాలని, ఆస్పత్రి సూపరింటెండెంట్ పై , డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని కోరాయి. ఇదే సమయంలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నించారు గిరిజన సంఘాల నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించు కోలేదంటూ మండిపడ్డారు. విద్యార్థి సంఘాలు కేఎంసీని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. తండాలో పెద్ద ఎత్తున తండావాసులు చేరుకున్నారు. గిర్ని తాండాలో విషాద వాతావరణం నెలకొంది. ఏదో అద్భుతం జరిగి ప్రీతి బతికి వస్తుందని కుటుంబీకులు భావించారు.
కానీ ఆమె అనుకోకుండా శవమై ఇంటికి వచ్చింది. పేరెంట్స్ గుండె లవిసేలా ఏడుస్తున్నారు. ప్రీతికి(Medico Preethi) న్యాయం జరగాలని కోరుతున్నారు. ప్రీతి చావుకు కారణమైన సీనియర్లు ఎవరో కూడా బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు .
Also Read : ప్రీతిది ఆత్మహత్య కాదు హత్యే