Manish Sisodia Court : కోర్టుకు హాజరైన మనీష్ సిసోడియా
5 రోజుల కస్టడీ కోరిన సీబీఐ
Manish Sisodia Court : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ అగ్ర నాయకుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ విచారణ చేపట్టింది. ఎనిమిది గంటల పాటు ఆయనను ప్రశ్నించింది. ఎన్ని ప్రశ్నలు వేసినా సరైన సమాధానం చెప్పక పోవడంతో అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది సీబీఐ. విచారణ అనంతరం సిసోడియాను కోర్టు ముందు సోమవారం హాజరు పర్చింది. కోర్టులో తమకు ఐదు రోజుల పాటు మనీష్ సిసోడియాను(Manish Sisodia Court) కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీబీఐ విన్నవించింది.
ఇంకా కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎంను కావాలని ఇరికించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించాచరు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకున్నారంటూ ఆరోపించారు.
డిప్యూటీ సీఎం అరెస్ట్ ను నిరసిస్తూ ఆప్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీ లోని భారతీయ జనతా పార్టీ ఆఫీసు తో పాటు ఆప్ ఆఫీసు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. జడ్జి ఎంకే నాగ్ పాల్ ఎదుట హాజరు పరిచేందుకు మనీష్ సిసోడియాను(Manish Sisodia Court) రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆప్ నిరసనలకు దిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆప్ నేతలు మండిపడ్డారు. కేంద్ర సర్కార్ ను ఎవరు విమర్శిస్తే వాళ్లపై కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆరోపించారు.
Also Read : సిసోడియా అరెస్ట్ డైలమాలో బడ్జెట్