BJP Win Exit Polls : త్రిపుర..నాగాలాండ్ లో బీజేపీకే ఛాన్స్
ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టమైన మెజారిటీ
BJP Win Exit Polls : ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. త్రిపుర, నాగాలాండ్ లలో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సాధిస్తుందని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం త్రిపురలో బీజేపీ(BJP Win Exit Polls) సులభంగానే మెజారిటీ సాధిస్తుందని పేర్కొన్నాయి. ఇక నాగాలాండ్ లో బీజేపీ కూటమితి తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి. సోమవారం ఇండియా టుడే , జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
ఈ రెండు జాతీయ స్థాయిలో పేరొందిన ప్రముఖ మీడియా సంస్థలు. ఇండియా టుడే ప్రకారం త్రిపురలో 36 నుంచి 45 స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలుపొందుతుందని అంచనా వేసింది. ఈ రాష్ట్రంలో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. మెజారిటీ రావాలంటే కనీసం 31 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది.
దీని అంచనా ప్రకారం త్రిపురలో ఢోకా లేదు బీజేపీకి(BJP Win Exit Polls). ఇక్కడ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశాయి. అయినా వాటి ప్రభావం ఎక్కడా కనిపించక పోవడం విశేషం. ఇక నాగాలాండ్ లో మొత్తం 60 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ , ఎన్డీపీపీ కూటమి 35 నుంచి 43 స్థానాల్లో విజయం సాధిస్తుందని జీ న్యూస్ మ్యాట్రిజ్ అంచనా వేసింది.
ఇక మేఘాలయంలో కాన్రాడ్ సంగ్మా కు చెందిన ఎన్పీపీ అతి పెద్ద పార్టీగా అవతరించనుందని జీ న్యూస్ వెల్లడించింది. ఇదిలా ఉండగా త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల ఎన్నిలకు సంబంధించి గురువారం కౌంటింగ్ కొనసాగుతుంది. ఆరోజే ఫలితాలు వెలువరిస్తారు. ప్రధానమంత్రి మోదీ హవా ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.
Also Read : సిసోడియా అరెస్ట్ డైలమాలో బడ్జెట్