TMC Meghalaya : మేఘాలయలో టీఎంసీ కింగ్ మేకర్
ఎగ్జిట్ పోల్స్ లో 11 సీట్లు వస్తాయని అంచనా
TMC Meghalaya : ఈశాన్య రాష్ట్రంలో కీలకమైన ఎన్నికలు ముగిశాయి. గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. త్రిపుర, నాగాలాండ్ లలో భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతుండగా కీలకమైన మేఘాలయలో ఎవరూ ఊహించని రీతిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా మారబోతోంది. మొత్తం 60 సీట్లకు గాను మెజారిటీ రావాలంటే 31 సీట్లు సాధించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీకి ఈసారి ఆశించిన మేర సీట్లు రాక పోవచ్చని అంచనా.
విచిత్రం ఏమిటంటే సీఎం కాన్రాడ్ సంగ్మా పార్టీకి 20 లేదా 21 సీట్లు రానుండగా కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు, తొలిసారిగా బరిలోకి దిగిన టీఎంసీకి 11 సీట్లు రానున్నాయని అంచనా వేశాయి. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కేంద్రంతో తమ పొత్తు ఉండదని ఇప్పటికే తేల్చి పారేశారు సీఎం కాన్రాడ్ సంగ్మా.
ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ(TMC Meghalaya) వాయిస్ ను వినిపించేందుకు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. విచిత్రం ఏమిటంటే ఇద్దరు సంగ్మాలు పోటీ పడబోతుండడం విశేషం. ఒకే కుటుంబానికి చెందిన వారు విరోధులుగా మారారు. కానీ రాజకీయంగా పవర్ లోకి రావాలంటే కలిసి ఉండక తప్పని పరిస్థితి.
2018లో రాష్ట్రంలో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈసారి 6 సీట్లు గెలుచుకోనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఎన్పీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. సంగ్మా పార్టీపై అవినీతి ఆరోపణలు, విభేదాలతో ఈసారి రెండు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగాయి. మాజీ సీఎం ముకుల్ సంగ్మా 11 మంది సహచరులతో కలిసి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. టీఎంసీలో చేరారు.
Also Read : త్రిపుర..నాగాలాండ్ లో బీజేపీకే ఛాన్స్