Jairam Ramesh : అస్త్రాలుగా మారిన దర్యాప్తు సంస్థలు
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్
Jairam Ramesh CBI : కాంగ్రెస్ మీడియా ఇంఛార్జ్ జైరాం రమేష్ (Jairam Ramesh) నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పారదర్శకతతో వ్యవహరించాల్సిన దర్యాప్తు సంస్థలు (సీబీఐ, ఈడీ, ఐటీ) పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఆధారాలు లేకుండానే దాడులకు దిగుతున్నాయని, కేవలం బీజేపీయేతర రాష్ట్రాలు, సంస్థలు, వ్యక్తులు, పార్టీలను లక్ష్యంగా చేసుకున్నాయంటూ ఫైర్ అయ్యారు.
ఇది పూర్తిగా కక్ష సాధింపు తప్ప మరొకటి కాదన్నారు. మంగళవారం జైరాం రమేష్ మీడియాతో మాట్లాడారు. ఈ మూడు దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రతీకారానికి అస్త్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు జైరాం రమేష్(Jairam Ramesh CBI). ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. విచారణ పేరుతో పిలవడం ఆ తర్వాత అరెస్ట్ చేయడం పనిగా పెట్టుకున్నాయంటూ ధ్వజమెత్తారు.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మోదీ సర్కార్ కు ఊడిగం చేస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ సంస్థలు కీలకమైన పాత్ర పోషించాల్సి ఉండగా అవేవీ పట్టించు కోవడం లేదన్నారు. ప్రతిపక్షనేతలు తమ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అనిల్ చౌదరి భిన్నంగా స్పందించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఆప్ అగ్ర నాయకుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని ప్రశంసించారు. తాము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ఆప్ సంపదను కూడ బెట్టేందుకు అధికారాన్ని అడ్డంగా వాడుకుంటోందని ఆరోపించారు.
Also Read : హిందూ మతం గొప్పది – జస్టిస్ జోసెఫ్