MP Sanjay Singh : మాజీ ఎల్జీపై కేసు పెట్టాల్సిందే – సింగ్
సిసోడియా అరెస్ట్ పై ఎంపీ ఆగ్రహం
MP Sanjay Singh LG : ఆప్ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh) సీరియస్ కామెంట్స్ చేశారు. తమ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కావాలని ఇరికించే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు.
మంగళవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. సిసోడియా తప్పు చేసినట్లు భావిస్తే ఎందుకని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆనాటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ పై కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ఇక్కడే కుట్ర జరిగిందన్నది తేలి పోయిందన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, పాలసీలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం ఉంటుందన్నారు. మద్యం పాలసీకి సంబంధించిన ఫైల్ పై సంతకం ఎల్జీదే ఉంటుందని మరి ఆయనపై కూడా కేసు నమోదు చేయాలని సంజయ్ సింగ్(MP Sanjay Singh LG) డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కోర్టు తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు ఎంపీ.
మోదీ సర్కార్ కేవలం బీజేపీయేతర పార్టీలు, వ్యక్తులు, నాయకులను కావాలని టార్గెట్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఇది పూర్తిగా ఖండిస్తున్నానని అన్నారు. ఏదో ఒక రోజు ప్రజలు నేల కేసి కొట్టడం ఖాయమని జోష్యం చెప్పారు. తమకు పూర్తి నమ్మకం ఉందని సిసోడియా ఎలాంటి అవినీతి మరక అంటకుండా బయటకు వస్తారని అన్నారు ఎంపీ.
నిన్న లాయర్లు అడిగిన ప్రశ్నలకు సీబీఐ వద్ద సమాధానం లేదన్నారు. సిసోడియా ఆఫీసుపై దాడి చేసినా ఏమీ దొరకలేదన్నారు. ఆనాడు మద్యం పాలసీపై సవరణలు చేయాలని ఎల్జీ కోరారు. మరి ఆయన సంతకం చేస్తే చర్యలు ఉండవా అని నిలదీశారు సంజయ్ సింగ్.
Also Read : సిసోడియా సరే యెడ్డీ మాటేంటి