Supreme Court Rejected : సిసోడియాకు సుప్రీం బిగ్ షాక్

ఢిల్లీ కోర్టుకు వెళ్లండ‌ని సూచ‌న

SC Rejected Sisodia Plea : ఆప్ అగ్ర నాయ‌కుడు, ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. త‌న‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేశార‌ని, బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టింది ధ‌ర్మాసనం. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ కేసు త‌మ ప‌రిధిలోకి రాద‌ని(SC Rejected Sisodia Plea) స్ప‌ష్టం చేసింది. అవినీతి, అక్ర‌మాల‌కు సంబంధించిన అంశ‌మ‌ని ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించాల‌ని సూచించింది.

దీనిపై విచారించ లేమంటూ పేర్కొంది ధ‌ర్మాస‌నం. ఇదిలా ఉండ‌గా మ‌ద్యం కుంభ‌కోణం కేసులో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, కావాల‌ని కేంద్రం త‌న‌పై క‌క్ష క‌ట్టింద‌ని ఆరోపించారు మ‌నీష్ సిసోడియా.

ఈ కేసుకు సంబంధించి త‌న‌కు స్టే ఇవ్వాల‌ని , బెయిల్ మంజూరు చేయాల‌ని డిప్యూటీ సీఎం కోరారు. కానీ కోర్టు ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను తోసిపుచ్చింది. అరగంట‌కు పైగా ఈ కేసుకు సంబంధించి విచార‌ణ చేప‌ట్టింది. చివ‌ర‌కు బెయిల్ ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని తేల్చి చెప్పింది. 

ఈ కేసు అవినీతితో ముడిప‌డి ఉంది. ఇది త‌మ ప‌రిధిలోకి రాద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ఇదిలా ఉండ‌గా మ‌నీష్ సిసోడియా త‌ర‌పున ప్ర‌ముఖ న్యాయ‌వాది అభిషేక్ మ‌ను సింఘ్వీ వాదించారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం ముందు గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్ర‌స్తావించారు. దానికి ఈ కేసుకు సంబంంధం లేద‌ని మ‌రోసారి ధ‌ర్మాస‌నం వివ‌రించింది.

ఏమైనా బెయిల్ కావాల‌ని అనుకుంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాల‌ని సూచించింది. కాగా సిసోడియాను ఐపీసీ 12- బి, 477 ఎ, అవినీతి నిరోధ‌క చ‌ట్టం లోని సెక్ష‌న్ 7 కింద అరెస్ట్ చేశారు.

Also Read : మాజీ ఎల్జీపై కేసు పెట్టాల్సిందే – సింగ్

Leave A Reply

Your Email Id will not be published!