Bhaskar Rao Joins BJP : ఆప్ కు షాక్ బీజేపీ లోకి జంప్
మాజీ ఐపీఎస్ ఆఫీసర్ రావు గుడ్ బై
Bhaskar Rao Joins BJP : కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ ఏడాది ఏప్రిల్ , మే నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారంలో మునిగి పోయాయి బీజేపీ , కాంగ్రెస్, జేడీఎస్. ఇక జంపింగ్ జిలానీలు పార్టీలు మారడం కొనసాగుతోంది. బీజేపీకి చెందిన కీలకమైన నాయకుడు ఒకరు కాంగ్రెస్ పార్టీలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సారథ్యంలో చేరారు.
తాజాగా మాజీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ భాస్కర్ రావు(Bhaskar Rao) ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ మేరకు కాషాయ కండువా కప్పుకున్నారు. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన చేరడం ఒక రకంగా మరింత బలాన్ని కలిగించింది బీజేపీకి . ఇదే సమయంలో ఆప్ కు కోలుకోలేని దెబ్బ.
ఈ మాజీ ఐపీఎస్ అధికారి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు. గత ఏడాది 2022 ఏప్రిల్ లో ఆప్ లో చేరారు. మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ గా కర్ణాటకలో పని చేశారు. ఆయనకు మంచి పట్టుంది. ఆప్ లో పారదర్శకత లోపించిందని, అవినీతి, అక్రమాలకు పార్టీ కేరాప్ గా మారిందని ఆరోపించారు.
అందుకే తాను బీజేపీ తీర్థం పుచ్చుకున్నానని చెప్పారు భాస్కర్ రావు(Bhaskar Rao Joins BJP). పైకి అవినీతిపై పోరాడాలని పిలుపునిస్తుందని..కానీ లోపల విరాళాలు పార్టీ సేకరిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఐపీఎస్. ప్రస్తుతం బీజేపీలో చేరేందుకు కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం. ఆయన దూర దృష్టి, ముందు చూపు నన్ను ఇందులో చేరేలా ప్రేరేపించిందన్నారు భాస్కర్ రావు.
Also Read : నిజాయితీకి దక్కిన గౌరవం – సిసోడియా