KC Singh : అమృతపాల్ సింగ్ భారతీయుడు కాదు
మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్ కామెంట్స్
KC Singh : మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 29 ఏళ్ల ఖలీస్తాన్ అనుకూల నాయకుడైన అమృతపాల్ సింగ్ ను అతడి మద్దతుదారులు భ్రిందన్ వాలే 2.0గా పిలుచుకుంటున్నారు. రాడికల్ సిక్కు బోధకుడు, స్వయం ప్రకటిత వేర్పాటు వాది అయిన అమృత పాల్ సింగ్ పాస్ పోర్ట్ ను అప్పగించాలని డిమాండ్ చేశారు. తనను తాను భారతీయ పౌరుడిగా పరిగణించ లేదన్నారు. సునేహ్రా పంజాబ్ పార్టీ చీఫ్ కేసీ సింగ్ మీడియాతో మాట్లాడారు.
ఐక్యరాజ్య సమితి హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యుఎన్ హెచ్ ఆర్ ఎస్ ) నుండి స్థితి లేని వ్యక్తిగా తన గుర్తింపును పొందాలని అన్నారు. ఎందుకంటే ఖలిస్తాన్ తన తలపై మాత్రమే ఉందంటూ ఎద్దేవా చేశారు కేసీ సింగ్(KC Singh). అమృత పాల్ సింగ్ హిందూ రాష్ట్రం , ఖలీస్తాన్ ల మధ్య సమాంతరంగా ఉన్నాడని అన్నారు. అయితే నినాదం మాత్రం ప్రత్యేక రాష్ట్రం కోసం అని పిలుపునిచ్చాడు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చేసిన కామెంట్స్ ను పరిగణలోకి తీసుకోవాలన్నారు కేసీ సింగ్.
అంతే కాదు ఆనాటి పీఎంకు పట్టిన గతే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు పడుతుందని హెచ్చరించారు అమృతపాల్ సింగ్. అమృతపాల్ సింగ్ ను దేశం నుంచి బహిష్కరించాలని కేసీ సింగ్(KC Singh) డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అమృత పాల్ సింగ్ గత ఏడాది ఇండియాకు తిరిగి రాక ముందే దుబాయ్ లోని ఒక రవాణా సంస్థలో పని చేస్తున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నటుడు డీప్ సిద్దు స్థాపించిన సామాజిక సంస్థ వారిస్ పంజాడ్ డి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు.
Also Read : భారీగా తగ్గిన ఉగ్రవాద దాడులు