Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అత్యవ‌స‌ర స‌మావేశం

ఆప్ ఎమ్మెల్యేలు..కౌన్సిలర్ల‌కు పిలుపు

Arvind Kejriwal Calls Meet : ఢిల్లీలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఒక దాని వెంట మ‌రొక‌టి ఇబ్బందిక‌రంగా మార‌డంతో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి ముఖ్య అనుచ‌రుడిగా అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాతో పాటు గ‌తంలో మ‌నీ లాండరింగ్ కు పాల్ప‌డిన కేసులో తీహార్ జైలులో ఉన్న స‌త్యేంద్ర జైన్ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు.

ఈ మేర‌కు ఆ ఇద్ద‌రూ సీఎం కేజ్రీవాల్ కు అంద‌జేశారు. ఈ రాజీనామా లేఖ‌ల‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనాకు పంపించారు. వారి స్థానంలో సౌర‌భ్ , అతిషి ని నియ‌మించారు ఆప్ చీఫ్ , సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal Calls Meet) . ప్ర‌స్తుతం కీల‌క‌మైన బ‌డ్జెట్ స‌మ‌ర్పించాల్సి ఉంది. తాజాగా ఇందుకు సంబంధించి పార్టీ ప‌రంగా ఎమ్మెల్యేలు, ఢిల్లీ మ‌హాన‌గ‌ర కార్పొరేష‌న్ (ఎంసీడీ) ప‌రిధిలోని కౌన్సిల‌ర్ల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని  ఏర్పాటు చేశారు సీఎం.

ఈ విష‌యం గురించి ఆప్ అంద‌రినీ స‌మాచారాన్ని అంద‌జేసింది. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ ప్ర‌భుత్వంలోని మొత్తం 33 శాఖ‌ల్లో ఒక్క సిసోడియానే 18 శాఖ‌లు నిర్వ‌హిస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో పార్టీ ఏం చేస్తుంద‌నే దానిపై ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగే అవకాశం ఉంద‌ని పార్టీ విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. స‌త్యేంద్ర జైన్ ఇప్ప‌టి దాకా ఎలాంటి శాఖ‌లు లేకుండానే మంత్రిగా కొన‌సాగారు. ఇద్ద‌రి రాజీనామాల‌ను ఫిబ్ర‌వ‌రి 28న ఎల్జీకి పంపించారు.

Also Read : అవ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్

Leave A Reply

Your Email Id will not be published!