Jagdeep Dhankhar Calls : దేశ సంక్షేమం కోసం సామూహిక ఉద్యమం

పార్ల‌మెంట‌రీ అంత‌రాయాల‌పై ఆగ్ర‌హం

Jagdeep Dhankhar Mass Movement : భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్ల‌మెంట‌రీ అంత‌రాయాల‌కు వ్య‌తిరేకంగా సామూహిక ఉద్య‌మం చేప‌ట్టాల‌ని(Jagdeep Dhankhar Mass Movement) పిలుపునిచ్చారు. త‌న విజ్ఞ‌ప్తి ఒక్క‌రి కోసం కాద‌ని ఇది పార్టీల‌కు అతీత‌మ‌ని చెప్పారు. రాజ‌కీయాల్లో వాటాదారుల‌కు సంబంధించిన‌ది కాద‌న్నారు. దేశ సంక్షేమం కోస‌మేన‌ని స్ప‌ష్టం చేశారు ఉప రాష్ట్ర‌ప‌తి. బుధ‌వారం బెంగళూరులో జ‌రిగిన స‌మావేశంలో జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. పార్ల‌మెంట్ అంత‌రాయాల‌పై బాధ‌ను వ్య‌క్తం చేశారు.

ప్ర‌జాస్వామ్య దేవాల‌యంలో ఇటువంటి ప్ర‌వ‌ర్త‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జాభిప్రాయాన్ని సృష్టించేందుకు ప్ర‌జ‌లు, ముఖ్యంగా యువ‌త పెద్ద ఎత్తున ఉద్య‌మించాల‌ని కోరారు జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్. నా బాధ‌ను కూడా మీతో పంచు కోవాల‌ని అనుకుంటున్నా. మ‌న రాజ్యాంగాన్ని రూపొందించ‌డంలో డాక్ట‌ర్ బాబా సహెబ్ అంబేద్క‌ర్ కీల‌క పాత్ర పోషించార‌ని కొనియాడారు. రాజ్యాంగ స‌భ‌లో మూడేళ్ల పాటు చ‌ర్చ జ‌రిగింది.

అనేక వివాదాస్ప‌ద అంశాలు కూడా ఉన్నాయి. భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. ఉమ్మ‌డి అభిప్రాయాన్ని క‌లిగి ఉండ‌టంలో కూడా ఇబ్బందులుఉన్నాయ‌ని అన్నారు ఉప రాష్ట్ర‌ప‌తి(Jagdeep Dhankhar). ఇంత జ‌రిగినా రాజ్యాంగ ప‌రిష‌త్తులో ఒక్క ఆటంకం జ‌ర‌గ‌లేదు. ఎలాంటి నినాదాలు చేయ‌లేద‌న్నారు. స్పీక‌ర్ వెల్ లోకి ఎవ‌రూ రాలేద‌న్నారు.

ప్ర‌ముఖ విద్యా వేత్త‌, ప‌రోప‌కారి, మౌలిక స‌దుపాయాల దార్శ‌నికుడు, పారిశ్రామిక‌వేత్త‌, దేశంలో క‌ర్ణాట‌క‌లో అనేక మైలు రాయి మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌ను రూపొందించ‌డం అగ్ర గామి అయిన డాక్ట‌ర్ ఎంఎస్ రామ‌య్య జ‌యంతి వేడుక‌ల‌లో పాల్గొని ప్ర‌సంగించాచ‌రు. రాజ్య‌స‌భ‌లోప్ర‌తి నిమిషం స‌మావేశానికి కోట్లాది ప్రజా ధ‌నం ఖ‌ర్చువుతోంద‌ని ఆవేద‌న చెందారు.

Also Read : ఢిల్లీ సీఎం అత్యవ‌స‌ర స‌మావేశం

Leave A Reply

Your Email Id will not be published!