Centre Suspends CPR : సీపీఆర్ ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్ ర‌ద్దు

చ‌ట్టాల ఉల్లంఘ‌న‌పై చ‌ర్య

Centre Suspends CPR : విధాన ప‌రిశోధ‌న కోసం థింక్ ట్యాంక్ సెంట‌ర్ విదేశీ నిధుల లైసెన్స్ స‌స్పెండ్ కు గురైంది. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ , ఆక్స్ పామ్ ఇండియా స‌ర్వేల త‌ర్వాత సీపీఆర్ ప‌రిశీల‌న‌లో ఉంది.

చ‌ట్టాల‌ను ఉల్లంఘించినందుకు ప్ర‌ముఖ ప‌బ్లిక‌క్ థింక్ ట్యాంక్ సెంట‌ర్ ఫ‌ర్ పాల‌సీ రీసెర్స్ (సీపీఆర్) కు సంబంధించిన ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్ ను హోం వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ స‌స్పెండ్(Centre Suspends CPR) చేసిన‌ట్లు బుధ‌వారం వెల్ల‌డించారు అధికారు. చ‌ట్టాలకు అనుగుణంగా లేక పోవ‌డం వ‌ల్ల‌నే ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్ ను ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు.

ఆక్స్ పామ్ కు సంబంధించిన ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్ గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో నిలిపి వేసింది కేంద్రం. ఆ త‌ర్వాత ఎన్జీఓ హోం మంత్రిత్వ శాఖ‌లో రివిజ‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఎఫ్‌సీఆర్ఏ కింద ఇచ్చిన లైసెన్స్ స‌స్పెన్ష‌న్ తో సీపీఆర్ ఎలాంటి విదేశీ నిధుల‌ను పొంద‌లేదు. ఇక సీపీఆర్ దాత‌ల‌లో బిల్ , మెలిండా గేట్స్ ఫౌండేష‌న్ , పెన్సిల్వేనియా యూనివ‌ర్శిటీ, వ‌ర‌ల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ , డ్యూక్ యూనివ‌ర్శిటీ కూడా ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.

సీపీఆర్(CPR) అనేది ఒక లాభాపేక్ష లేని సంస్థ‌. ఇది ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ సోష‌ల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) నుండి గ్రాంట్ ల‌ను కూడా పొందుతోంది. ఇది సైన్స్ అండ్ టెక్నాల‌జీ విభాగానికి చెందిన గుర్తింపు సంస్థ‌. థింక్ ట్యాంక్ అందుకున్న ఎఫ్‌సీఆర్ఏ నిధుల‌కు సంబంధించి స్ప‌ష్టత‌, ప‌త్రాల‌ను ఇవ్వాల‌ని కోరిన‌ట్లు తెలిపింది.

Also Read : దేశ సంక్షేమం కోసం సామూహిక ఉద్యమం

Leave A Reply

Your Email Id will not be published!