Supreme Court ECI : కేంద్ర నిర్ణయం ప్రజాస్వామానికి ప్రమాదం
భారత సర్వోన్నత న్యాయ స్థానం కామెంట్స్
Supreme Court ECI : కేంద్ర ఎన్నికల కమిషన్ కు సంబంధించి కమిషనర్ల నియామకంపై సంచలన తీర్పు వెలువరించింది భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం గురువారం కీలక తీర్పు(Supreme Court ECI) వెలువరించింది. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక రకంగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చింది. తమ ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. ఆదరాబాదరాగా నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించింది.
దేశంలో ఎన్నికలు సమర్థవంతంగా , పూర్తి పారదర్శకతతో నిర్వహించాలంటే సమర్థవంతమైన కమిషనర్లు ఉండాలని పేర్కొంది. లేక పోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
ఇది ఎన్నికల కమిషన్ పట్ల మరింత చులకన భావం ఏర్పడనుందని ఆవేదన వ్యక్తం చేసింది. దేశానికి ప్రజాస్వామ్యం వెన్నెముక లాంటిది. దీనిని పదిలంగా కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎన్నికలు తేలిగ్గా తీసి పారేసేందుకు వీలు లేదు. ఎందుకంటే ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కేవలం ఎన్నికల ద్వారా మాత్రమే కలుగుతుంది.
ఈ తరుణంలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించే సామర్థ్యం ఎన్నికల కమిషన్ కు దానిని నిర్వహిస్తున్న కమిషనర్లకు ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరి మెప్పు కోసమో ఎన్నికల కమిషనర్లు పని చేయడం ఉండ కూడదు.
వీలైతే దేశ రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని అవసరమైతే కేంద్ర మంత్రులను కూడా నిలదీసే సామర్థ్యం ఈసీ కమిషనర్ కు ఉండాలని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్ల(Supreme Court ECI) నియామకం ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సీజేఐతో కూడిన ప్యానెల్ కమిటీ నియమిస్తుందని స్పష్టం చేసింది. వీరు చేసిన సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించాలని పేర్కొంది.
Also Read : ఈసీ నియామకాలపై సుప్రీం షాక్