S Jai Shankar : నిర్ణయాలలో లోపం ప్రపంచానికి శాపం
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్
S Jai Shankar G20 Meet : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఐక్య రాజ్య సమితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎన్ లో ప్రపంచ నిర్ణయాల ప్రక్రియ లోని లోపాలను ఎత్తి చూపారు ప్రత్యేకంగా. గురువారం న్యూఢిల్లీలో జరిగిన జి20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఎస్ జై శంకర్(S Jai Shankar G20 Meet) ప్రసంగించారు. ప్రస్తుత గ్లోబల్ ఆర్కిటెక్చర్ ఎనిమిదవ దశాబ్దంలో ఉందన్నారు. ఈ కాలంలో యుఎన్ సభ్యుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ఇది నేటి రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం , జనాభా లేదా ఆకాంక్షలను ప్రతిబింబించదని అన్నారు జై శంకర్.
2005 నుండి సంస్కరణలకు సంబంధించిన భావాలు అత్యున్నతమైన స్థాయిలో వ్యక్తం అవుతున్నాయని అన్నారు. కానీ మనందరికీ తెలిసినట్లుగా ఇవి ఆచరణకు నోచుకోలేదన్నారు సుబ్రమణ్యం జైశంకర్. కారణాలు కూడా రహస్యం ఎంత మాత్రం కాదన్నారు. మనం దానిని ఎంత ఎక్కువ కాలం వాయిదా వేస్తామో బహుళపక్ష వాదానికి సంబంధించిన విశ్వసనీయత మరింత క్షీణిస్తుందన్నారు. భవిష్యత్తును కలిగి ఉండాలంటే ప్రపంచ నిర్ణయాధికారం ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని స్పష్టం చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar).
ఇటీవల టర్కీ , సిరియాలో సంభవించిన భూకంపాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి జి20 సమావేశం కొద్దిసేపు మౌనం పాటించింది. ఈ సమూహం అసాధారణమైన బాధ్యతను కలిగి ఉందన్నారు కేంద్ర మంత్రి. ఈ ప్రపంచానికి దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉందని స్పష్టం చేశారు సుబ్రమణ్యం జై శంకర్. అన్ని దేశాలు ఆధిపత్య ధోరణిని పక్కన పెట్టి సంక్షేమం దిశగా సాగాలని పిలుపునిచ్చారు.
Also Read : జై శంకర్ తో బీబీసీపై దాడి ప్రస్తావన