Kasba Peth Congress : బీజేపీకి షాక్ కాంగ్రెస్ గెలుపు
మరాఠాలో కోలుకోలేని దెబ్బ
Kasba Peth Congress : మహారాష్ట్రలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) గెలుపొందడం మహా వికాస్ అఘాడీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తన సమీప భారతీయ జనతా పార్టీకి చెందిన హేమంత్ రసానేపై 11,000 ఓట్ల కంటే ఎక్కువ తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర ధంగేకర్ గెలుపొందారు. 1995 నుంచి కుంకుమ పార్టీ ఆధీనంలో ఉంది ఈ నియోజకవర్గం. పూణే లోని కస్బా పేత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలవడం బీజేపీకి మింగుడు పడడం లేదు.
ఎందుకంటే మహా వికాస్ అఘాడీ సర్కార్ ను పడగొట్టి శివసేన తిరుగుబాటు అభ్యర్థి ఏక్ నాథ్ షిండేతో కలిసి బీజేపీ సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసింది. చివరకు గవర్నర్ ను కూడా తొలగించే పరిస్థితికి తీసుకు వచ్చింది. ఇదిలా ఉండగా గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ గెలుపొందడంపై ఎంవీఏ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ గెలుపు తమకు మరింత కొత్త ఉత్సామాన్ని ఇచ్చిందన్నారు.
రాబోయే రోజుల్లో బీజేపీ ఓటమికి ఇది ఓ మార్క్ అని పేర్కొన్నారు. కస్బా పేటలో కాంగ్రెస్(Kasba Peth Congress) గెలుపొందడంతో మహా వికాస్ అఘాడీకి చెందిన ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన బాల్ థాక్రే పార్టీల నేతలు, కార్యకర్తలు సంబురాలలో మునిగి పోయారు. అవినీతి సర్కార్ కు ఈ గెలుపు ఓ చెంప పెట్టు అని పేర్కొన్నారు. ఎంత కాలం ఆధిపత్యాన్ని కలిగి ఉండడం సాధ్య పడదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలని పేర్కొన్నారు.
బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముక్తా తిలక్ మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.
Also Read : సుప్రీం నిర్ణయం శిరోధార్యం – అదానీ